ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

LokSabha Elections: తనయుడి భవిష్యత్తుపై స్పందించిన మేనకా గాంధీ

ABN, Publish Date - May 11 , 2024 | 01:02 PM

తన కుమారుడు వరుణ్ గాంధీ సమర్థుడైన నాయకుడని ఆయన తల్లి మేనకా గాంధీ స్పష్టం చేశారు. అతడిపై తనకు విశ్వాసం ఉందన్నారు. కొందరు ఎంపీలు అయి రాజకీయ నాయకులవుతారు.

Menaka Gandhi

న్యూఢిల్లీ, మే 11: తన కుమారుడు వరుణ్ గాంధీ సమర్థుడైన నాయకుడని ఆయన తల్లి మేనకా గాంధీ స్పష్టం చేశారు. అతడిపై తనకు విశ్వాసం ఉందన్నారు. కొందరు ఎంపీలు అయి రాజకీయ నాయకులవుతారు. మరికొందరు ఎంపీ అవకుండానే రాజకీయ నాయకులవుతారన్నారు. అందుకు మాజీ ప్రధాని చంద్రశేఖర్ అంశాన్ని ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు.

Lanka Dinakar: వైసీపీ నేతల్లో ఓటమి అనే నైరాశ్యం నిండిపోయి రెచ్చిపోతున్నారు

ఈ ఎన్నికల్లో పిలిబిత్ లోక్‌సభ స్థానాన్ని వరుణ్ గాంధీకి బీజేపీ అగ్రనాయకత్వం కేటాయించ లేదు. దీంతో వరుణ్ గాంధీ భవిష్యత్ ఏమిటంటూ విలేకర్లు అడిగిన ప్రశ్నకు మేనకా గాంధీ పై‌విధంగా సమాధానమిచ్చారు. అయితే పార్టీ నిర్ణయాన్ని తాను వ్యతిరేకించనని.. గౌరవిస్తానని ఆమె తెలిపారు. ఎన్నికల బరిలో ఎవరిని అభ్యర్థులుగా నిలపాలనేది పార్టీ నిర్ణయిమన్నారు.


సుల్తాన్‌పుర్ నుంచి మరోసారి ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలవడం పట్ల మేనకా గాంధీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ నియోజకవర్గ ప్రజలకు మరోసారి సేవ చేసుకునే అవకాశం తనకు కలిగిందన్నారు. ఇక సుల్తాన్‌పూర్ పొరుగున ఉన్న రాయ్‌బరేలీ నుంచి బరిలో దిగిన రాహుల్ గాంధీ‌పై స్పందించేందుకు ఆమె నిరాకరించారు.

Amit Shah Vikarabad Live: ప్రధాని మోదీపై ఒక్క అవినీతి మరకా లేదు: అమిత్ షా

అలాగే రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు శ్యామ్ పిట్రోడా ఇటీవల చేసిన వారసత్వ పన్ను వ్యాఖ్యలపై మేనకాగాంధీ స్పందించారు. ఈ విధానాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. గత ఎన్నికల్లో వరుణ్ గాంధీ పిలిబిత్ లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికల్లో ఆ లోక్‌సభ స్థానాన్ని మరొకరికి బీజేపీ కేటాయించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో విలేకర్లు అడిగిన ప్రశ్నకు మేనకా గాంధీపై విధంగా స్పందించారు.

Read Latest National News And Telugu News

Updated Date - May 11 , 2024 | 07:36 PM

Advertising
Advertising