ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Obesity: స్థూలకాయంపై ఆర్థిక సర్వేలో షాకింగ్ విషయాలు..

ABN, Publish Date - Jul 22 , 2024 | 01:53 PM

ప్రస్తుతం ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సమస్య స్థూలకాయం. ఈ సమస్య నుంచి ఎలా బయట పడాలో తెలియక చాలా మంది సతమతమవుతున్నారు. స్థూల కాయం సమస్యతో బాధపడే వారి సంఖ్య ఇటీవలి కాలంలో మరింత పెరిగినట్టు ఆర్థిక సర్వే చెబుతోంది.

ఢిల్లీ: ప్రస్తుతం ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న సమస్య స్థూలకాయం (Obesity). ఈ సమస్య నుంచి ఎలా బయట పడాలో తెలియక చాలా మంది సతమతమవుతున్నారు. స్థూల కాయం సమస్యతో బాధపడే వారి సంఖ్య ఇటీవలి కాలంలో మరింత పెరిగినట్టు ఆర్థిక సర్వే (Finance Survey) చెబుతోంది. జెండర్‌తో సంబంధం లేకుండా స్త్రీ,పురుషులిద్దరిలో స్థూలకాయం గణనీయంగా పెరిగినట్టు సర్వే నిర్వాహకులు గుర్తించారు. 18-69 ఏళ్ల వయస్సు మధ్యగల స్త్రీ, పురుషుల్లో స్థూలకాయంపై సర్వే చేయడం జరిగింది.


నేషనల్ ఫ్యామిలీ హెల్త్ (NFHS-5) అనే సంస్థ దేశ వ్యాప్తంగా స్థూలకాయులపై ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం సగటున దేశంలో 22.9 శాతం మగాళ్లు స్థూలకాయంతో బాధపడుతున్నారు. గతంలో 18.9 శాతంతో పోల్చితే 4% స్థూలకాయం పెరిగింది. మహిళల్లోనూ స్థూలకాయం 20.6% నుంచి 24%కు పెరుగుదల నమోదు అయ్యింది. స్థూలకాయంతో బాధపడుతున్న రాష్ట్రాల్లో ఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా.. ఆ తర్వాతి స్థానంలో తమిళనాడు ఉంది. ఢిల్లీలో మహిళల్లో ఒబేసిటీ 41.3 శాతం కాగా.. పురుషుల్లో 38 శాతంగా ఉంది.


తమిళనాడులో 37 శాతం పురుషులు, 40.4 శాతం మహిళలు స్థూలకాయంతో ఇబ్బంది పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో స్థూలకాయంతో బాధపడుతున్న వారిలో మహిళలు 36.3 శాతం, పురుషులు 31.1 శాతం ఉన్నారు. తెలంగాణలో స్థూలకాయంతో బాధపడుతున్నవారిలో మహిళలు 30.1 శాతం, పురుషులు 32.3 శాతంగా ఉన్నట్టు సర్వే తేల్చింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో స్థూలకాయం పెరిగినట్టు సర్వేలో వెల్లడైంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే(NFHS-5) జరిపిన సమయం (2019-2021)లో కోవిడ్-19 మహమ్మారి విస్తృతి, లాక్‌డౌన్ ప్రభావంతో పరిమిత స్థాయిలో శారీరక శ్రమ కారణంగా ఒబేసిటీ గణనీయంగా పెరిగినట్టు గుర్తించడం జరిగింది.

For Latest News and National News click here

Updated Date - Jul 22 , 2024 | 03:51 PM

Advertising
Advertising
<