ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మోదీదే తుది నిర్ణయం

ABN, Publish Date - Nov 28 , 2024 | 04:51 AM

మహారాష్ట్ర కొత్త సీఎం ఎంపిక, ప్రభుత్వ ఏర్పాటుపై ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాలదే తుది నిర్ణయమని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఏక్‌నాథ్‌ శిందే స్పష్టం చేశారు.

సీఎం ఎంపికపై స్పష్టత ఇచ్చిన ఏక్‌నాథ్‌ శిందే

కేంద్ర మంత్రి పదవిపై ఆసక్తి లేదని వెల్లడి

శిందే, అజిత్‌ పవార్‌లకు ఢిల్లీ నుంచి ఆహ్వానం

ఢిల్లీకి ఫడణవీస్‌.. మహా కొత్త సీఎం ప్రమాణం 2న?

ముంబై, న్యూఢిల్లీ, నవంబరు27: మహారాష్ట్ర కొత్త సీఎం ఎంపిక, ప్రభుత్వ ఏర్పాటుపై ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాలదే తుది నిర్ణయమని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఏక్‌నాథ్‌ శిందే స్పష్టం చేశారు. మోదీ, షాతో తాను ఫోన్‌లో మాట్లాడానని, కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై తమ తరపున ఎలాంటి అడ్డంకులు ఉండబోవని స్పష్టం చేసినట్లు ముంబైలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. తనకు కేంద్ర మంత్రి పదవిపై ఆసక్తి లేదని కూడా శిందే తేల్చి చెప్పారు. అయితే మహాయుతికి ప్రజలు ఘన విజయం అందించిన నేపథ్యంలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం వారి ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఉధృతంగా పనిచేయాల్సి ఉంటుందన్నారు. శిందే ప్రకటనతో బీజేపీ తరపున కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు మార్గం సుగమమైంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు జరిపేందుకు ఢిల్లీకి రావాలని శిందే, అజిత్‌ పవార్‌లకు బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. సీఎం, డిప్యూటీ సీఎం పదవులతో పాటు ఇతర మంత్రిత్వ శాఖల కేటాయింపులపై శిందే, పవార్‌లతో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు, శివసేన ఎంపీలు పార్లమెంట్‌లో అమిత్‌ షాతో సమావేశమయ్యారు.


ఢిల్లీకి చేరుకున్న ఫడణవీస్‌

మహారాష్ట్ర బీజేపీ సీనియర్‌ నేత ఫడణవీస్‌ ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. శిందే విలేకరుల సమావేశంలో చేసిన ప్రకటనతో అందరి అనుమానాలు తీరి ఉంటాయని ఫడణవీస్‌ చెప్పా రు. మహాయుతి కూటమిలో ఎలాంటి విభేదాలు లేవని, ఉమ్మడిగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పారు. డిసెంబరు రెండున కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ కార్యక్రమం ఉండొచ్చని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.

మహాయుతి గెలుపు బంపర్‌ డ్రా

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి గెలుపును బంపర్‌ లక్కీ డ్రా గెలుచుకోవడంగా శివసేన(యూబీటీ) అభివర్ణించింది. ఈవీఎంల వినియోగంపై అనుమాన మేఘాలు కమ్ముకున్నాయని అన్నది. ‘ఈవీఎంలతో ఏదైనా సాధ్యమే’ అని శివసేన(యూబీటీ)పార్టీ పత్రిక సామ్నా బుధవారం ఎడిటోరియల్‌లో తెలిపింది. ‘‘95 నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల సంఖ్యకు, ఈవీఎంలో లెక్కించిన ఓట్ల సంఖ్యకు తేడా, ఈవీఎంలలో చార్జింగ్‌.. వంటివి ఈవీఎం స్కామ్‌పై అనుమానాలకు బలం చేకూర్చుతున్నాయి’’ అని పేర్కొంది.

Updated Date - Nov 28 , 2024 | 04:52 AM