ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

GSAT-20: నింగిలోకి దూసుకెళ్లిన జీశాట్-20 ఉపగ్రహం..

ABN, Publish Date - Nov 19 , 2024 | 08:36 AM

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రూపొందించిన అత్యంత అధునాతన సమాచార ఉపగ్రహం జీశాట్-20 నింగిలోకి దూసుకెళ్లింది. అమెరికాలోని ఫ్లోరిడా కేప్‌ కెనావెరల్‌ వేదికగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. 4700 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని మన రాకెట్‌లు తీసుకెళ్లేందుకు సాధ్యపడకపోవడంతో స్పేస్‌ ఎక్స్‌ ద్వారా ఇస్రో ప్రయోగించింది.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) రూపొందించిన అత్యంత అధునాతన సమాచార ఉపగ్రహం జీశాట్-20 (GSAT-20) నింగిలోకి దూసుకెళ్లింది. అమెరికా బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ సంస్థ రూపొందించిన ఫాల్కన్‌-9 రాకెట్‌.. ఈ జీశాట్-20ను నింగిలోకి మోసుకెళ్లింది. అమెరికా (America)లోని ఫ్లోరిడా కేప్‌ కెనావెరల్‌ (Florida Cape Canaveral) వేదికగా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. 4700 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని మన రాకెట్‌లు తీసుకెళ్లేందుకు సాధ్యపడకపోవడంతో స్పేస్‌ ఎక్స్‌ (Space X) ద్వారా ఇస్రో ప్రయోగించింది. జీశాట్‌-20 ఉపగ్రహం 14 ఏళ్ల పాటు సేవలు అందించనుంది. వాణిజ్య పరంగా ఇస్రో, స్పేస్‌ఎక్స్‌ మధ్య ఇదే తొలి ప్రయోగం.


భారత్‌లోని మారుమూల ప్రాంతాలు, అండమాన్‌ నికోబార్‌, లక్షద్వీప్‌ వంటి ద్వీపాల్లోనూ ఇంటర్నెట్‌ సేవలను అందించడమే ఈ ఉపగ్రహం లక్ష్యం. అంతేకాకుండా అడ్వాన్స్‌డ్‌ బ్యాండ్‌ ఫ్రీక్వెన్సీ లక్ష్యంగా ఇస్రో దీన్ని రూపొందించింది. జీశాట్‌-ఎన్‌2 ఉపగ్రహం ద్వారా విమానాల్లో వై-ఫై సేవలు మరింత విస్తృతం కానున్నాయి. ఈ ప్రయోగం కోసం ఇస్రో దాదాపు రూ. 590 కోట్లు ఖర్చు చేసినట్లు తెలియవచ్చింది. స్పేస్ ఎక్స్‌ రాకెట్‌ ఎందుకంటే.. భారీ ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చాలంటే ఇస్రో.. తన సొంత ప్రయోగ వాహనం మార్క్‌-3 రాకెట్‌ను రంగంలోకి దించుతుంది. బాహుబలిగా పేరుగాంచిన ఈ రాకెట్‌ 4 వేల కేజీల బరువున్న భారీ శాటిలైట్లను సైతం మోసుకెళ్లగలదు. అయితే ఇస్రో తాజాగా సిద్ధం చేసిన జీశాట్‌-ఎన్‌2 బరువు దాదాపు 4,700 కేజీలు. గతంలో ఇలాంటి భారీ ఉపగ్రహ ప్రయోగాల కోసం ఫ్రెంచ్‌ సంస్థ ఏరియన్‌ స్పేస్‌పై ఇస్రో ఆధారపడింది. ప్రస్తుతం ఆ కంపెనీ వద్ద ఇలాంటి ఆపరేషనల్‌ రాకెట్లు లేవు. అలాగే ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యా సేవలను పొందే అవకాశం కూడా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో భారీ రాకెట్లను ప్రయోగించగల స్పేస్‌ ఎక్స్‌ ఫాల్కన్‌-9 రాకెట్‌ను ఇస్రో ఎంచుకుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఒంగోలు పోలీస్ స్టేషన్‌లో రాంగోపాల్ వర్మ కేసు విచారణ..

అసెంబ్లీలో మంగళవారం ఏయే బిల్లులు ప్రవేశపెట్టనున్నారంటే..

మణిపూర్‌ పరిస్థితే లగచర్లలోనూ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 19 , 2024 | 08:36 AM