ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

CJI: బెత్తం దెబ్బలు తిన్నా.. సిగ్గుతో ఇంట్లో చెప్పలేదు: సీజేఐ

ABN, Publish Date - May 06 , 2024 | 04:59 AM

పిల్లల పట్ల ఉపాధ్యాయుల ప్రవర్తన వారి మనస్సులపై తీవ్ర ప్రభావం చూపుతుందని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ తెలిపారు. చిన్నప్పుడు పాఠశాలలో టీచరు చేతిలో బెత్తం దెబ్బలు తిన్న అనుభవాన్ని ఇప్పటికీ మరిచిపోలేనన్నారు.

పిల్లల పట్ల ఉపాధ్యాయుల ప్రవర్తన వారి మనస్సులపై తీవ్ర ప్రభావం చూపుతుందని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ తెలిపారు. చిన్నప్పుడు పాఠశాలలో టీచరు చేతిలో బెత్తం దెబ్బలు తిన్న అనుభవాన్ని ఇప్పటికీ మరిచిపోలేనన్నారు. నేపాల్‌ రాజధాని కాఠ్‌మండూలో ‘జువైనల్‌ జస్టిస్‌’ అంశంపై జరిగిన సదస్సులో పాల్గొన్న జస్టిస్‌ చంద్రచూడ్‌ అప్పటి సంగతులు గుర్తుచేసుకున్నారు. ‘‘నేను ఐదో తరగతి చదువుతున్నప్పుడు టీచర్‌ నా చేతిపై కొట్టారు.


ఆ విషయాన్ని ఇంట్లో చెప్పలేదు. ఇంట్లోవాళ్లకు చేతిపై దెబ్బ కనబడకుండా పదిరోజుల పాటు జాగ్రత్తపడ్డా’’ అని జస్టిస్‌ చంద్రచూడ్‌ పేర్కొన్నారు. కాగా, నేపాల్‌ ప్రధాన న్యాయమూర్తి బిశ్వంభర్‌ ప్రసాద్‌ శ్రేష్ఠ ఆహ్వానంపై మూడు రోజుల పర్యటన కోసం జస్టిస్‌ చంద్రచూడ్‌ అక్కడకు వెళ్లారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తి అధికారికంగా నేపాల్‌లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Updated Date - May 06 , 2024 | 04:59 AM

Advertising
Advertising