ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

PM Modi Ayodhya Speech: రామాయణంలోని కీలక పాత్రలను తన ప్రసంగంలో ప్రస్తావించిన మోదీ

ABN, Publish Date - Jan 22 , 2024 | 06:43 PM

అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ఉద్వేగభరిత ప్రసంగంలో రామాయణంలోని పలు పాత్రల విశిష్టతను గుర్తుచేశారు. ఆ పాత్రల్లోని అంకిత భావాన్ని, సందేశాన్ని అందిపుచ్చుకుని జాతి నిర్మాణంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

న్యూఢిల్లీ: అయోధ్య రామాలయం (Ayodhya Ram Temple)లో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) చేసిన ఉద్వేగభరిత ప్రసంగంలో రామాయణంలోని పలు పాత్రల విశిష్టతను గుర్తుచేశారు. ఆ పాత్రల్లోని అంకిత భావాన్ని, సందేశాన్ని అందిపుచ్చుకుని జాతి నిర్మాణంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. శబరి, నిషాద రాజు గుహుడు, ఒక ఉడుత, జటాయువు పాత్రలను ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తావించారు.


శబరి..

రామభక్తురాలైన శబరి మాతకు రామాయణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఆమె ఏళ్ల తరబడి రాముని రాకకోసం నిరీక్షించి తన కలను సాకారం చేసుకున్న గిరిజన మహిళా శిరోమణి. అరణ్యవాసంలో రాముడు శబరి ఆతిథ్యం తీసుకుని ప్రేమతో అందించిన పళ్లను స్వీకరించి ఆమె జన్మను చరితార్ధం చేశాడు. శబరి మాత రామునిపై ఉంచిన విశ్వాసం గొప్పదని, రాముడు వస్తాడనే ఆమెకున్న నమ్మకమే పునాదిగా ఉజ్వల భారతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.


గుహుడు

రాముడు, సీత, లక్ష్మణులను గంగానది దాటించి వారిపట్ల స్నేహశీలతను చాటుకున్న గిరిజన నేత గుహుడు. వారి మైత్రీ బంధం రామాయణంలో పలు చోట్ల కనిపిస్తుంది. రాముడు 14 ఏళ్ల వనవాసం తర్వాత కూడా తన మిత్రుడిని మరిచిపోకుండా కలుసుకుంటాడు. రాముడు-గుహుడి మధ్య మైత్రీబంధాన్ని ప్రధానమంత్రి మోదీ ప్రస్తావిస్తూ, దేశ నిర్మాణంలో ప్రజలంతా ఇలాంటి మైత్రీబంధాన్ని కలిగి ఉండాలని, రామాయణంలోని గుహుడి పాత్ర ఇందుకు ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు.


ఉడుత

లంక చేరడానికి వారధి నిర్మించే సమయంలో అల్పప్రాణి అయిన ఉడుత సాయం చేసిన కథ కూడా రామాయణ ప్రాత్రల్లో ప్రచారంలో ఉంది. వారధి కోసం హనుమంతుడు, ఇతర వానరులు పెద్ద పెద్ద బండరాళ్లు సముద్రంలో పడవేస్తుండగా, ఉడుత సైతం వారితో పాలుపంచుకుని చిన్నచిన్న గులకరాళ్లు తెచ్చి సముద్రంలో జారవిడచేది. ఉడుత సాయం రాముని ప్రశంసలు సైతం అందుకుంది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ప్రస్తావిస్తూ, నేను సాధారణ వ్యక్తిననుకునే వాళ్లు ఉడుత సాయాన్ని గుర్తుంచుకోవాలని, సాయం చిన్నదైనా, పెద్దదైనా జాతి నిర్మాణానికి ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు.


జటాయువు

రామాయణంలో పక్షిరాజు జటాయువుకు ప్రత్యేకత ఉంది. సీతాపహరణ సమయంలో రావణాసురునికి ఎదురునిల్చి పోరాడింది. రావణుడు మాయోపాయంతో జటాయువు రెక్కలు కత్తిరించడంతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ చివరి క్షణంలో శ్రీరాముని ఒడిలో కన్నుమూసింది. రాముడే స్వయంగా జటాయువుకు అంతిమ సంస్కారాలు జరిపాడు. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి మోదీ తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ, రావణుడు తెలివైన వాడే కాకుండా శక్తివంతుడని, జటాయువు అంకితభావంతో రావణుని ఎదిరించిందని చెప్పారు. రావణుడిని జయించలేమని తెలిసి కూడా అతన్ని జటాయువు సవాలు చేసిందన్నారు. విధి నిర్వహణలో జటాయువుకు ఉన్న అంకితభావాన్ని అందరూ అలవరుచుకుని భవ్య భారతదేశం కోసం కృషి చేయాలని కోరారు.

Updated Date - Jan 22 , 2024 | 06:43 PM

Advertising
Advertising