ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Nishant Agarwal: పాక్‌కు ‘బ్రహ్మోస్’ లీక్ చేసిన ఇంజినీర్‌కు యావజీవ శిక్ష విధించిన కోర్టు

ABN, Publish Date - Jun 03 , 2024 | 06:52 PM

భారత్ పొరుగునున్న దాయాది దేశం పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్‌ఐకి బ్రహ్మోస్ మాజీ ఇంజినీర్ నిషాంత్ అగర్వాల్ కీలక సమాచారం అందించారనే అభియోగాలు రుజువయ్యాయి.

నాగ్‌పూర్, జూన్ 03: భారత్ పొరుగునున్న దాయాది దేశం పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్‌ఐకి బ్రహ్మోస్ మాజీ ఇంజినీర్ నిషాంత్ అగర్వాల్ కీలక సమాచారం అందించారనే అభియోగాలు రుజువయ్యాయి. ఈ నేపథ్యంలో నాగ్‌పూర్ సెషన్స్ కోర్టు అతడికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే రూ.3 వేల జరిమానా చెల్లించాలని అతడిని ఆదేశించింది. ఈ మేరకు అడిషనల్ సెషన్స్ కోర్టు జడ్జి ఎంవి దేశ్‌పాండే సోమవారం తీర్పు వెలువరించారు.

Also Read: Nitheesha Kandula: యూఎస్‌లో మరో భారతీయ విద్యార్థి అదృశ్యం


నాగ్‌పూర్‌లోని కంపెనీ మిసైల్ సెంటర్‌లో టెక్నికల్ రీసర్చ్ సెక్షన్‌లో అగర్వాల్ ఉద్యోగిగా విధులు నిర్వహించేవాడు. ఆ క్రమంలో నాలుగళ్లు బ్రహ్మోస్ క్షిపణి ప్రాజెక్ట్‌లో ఇంజినీర్‌గా పని చేశారు. దీంతో ప్రాజెక్ట్‌కు సంబంధించిన అత్యంత సున్నితమైన సాంకేతిక అంశాలను అతడు పాక్‌ ఐఎస్‌ఐకు అందించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. 2018లో దీనిపై ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో మిలటరీ ఇంటెలిజెన్స్, యాంటీ టెర్రరిజం స్క్వాడ్ సంయుక్తంగా దర్యాప్తు చేపట్టాయి.

Also Read: ఏపీలో తొలి, తుది ఫలితం వెల్లడయ్యే నియోజకవర్గాలు ఏవంటే..?


అనంతరం నిషాంత్‌ను అరెస్ట్ చేసి.. అతడిపై ఇండియన్ పీనల్ కోడ్‌‌లోని పలు సెక్షన్లతోపాటు అధికారిక రహాస్యాల చట్టం కింద కేసు నమోదు చేశాయి. ఇంకోవైపు ఇదే కేసులో ముంబై హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ నిషాంత్‌కు ఈ ఏడాది ఏప్రిల్‌లో బెయిల్ మంజూరు చేసింది. బ్రహ్మోస్ క్షిపణిని భారత్, రష్యా సంయుక్తంగా తయారు చేసిన సంగతి తెలిసిందే.

Also Read: AP Assembly Elections: ఈసీ మరో సంచలన నిర్ణయం
Read Latest Telangana News and National News

Updated Date - Jun 03 , 2024 | 06:54 PM

Advertising
Advertising