Explosion: అమృతసర్ పోలీస్ స్టేషన్ వద్ద పేలుడు..
ABN, Publish Date - Dec 17 , 2024 | 11:39 AM
పంజాబ్‌లో పేలుడు కలకలం రేగింది. అమృతసర్‌లోని పోలీస్ స్టేషన్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు పేలుడు సంభవించింది. ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ పేలుడు తమ పనేనంటూ జర్మనీకి చెందిన గ్యాంగ్ స్టార్ జీవన్ ఫౌజీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు.
అమృతసర్: పంజాబ్ (Punjab)లో పేలుడు (Explosion) కలకలం రేగింది. అమృతసర్ (Amritsar)లోని పోలీస్ స్టేషన్ (Police Station) సమీపంలో మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు పేలుడు సంభవించింది. ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు ఈ పేలుడు తమ పనేనంటూ జర్మనీకి చెందిన గ్యాంగ్ స్టార్ జీవన్ ఫౌజీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడు. దీంతో పోలీసులు 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కాగా ఈనెల 4న అమృత్‌సర్‌లోని మజితా పోలీస్ స్టేషన్‌లో పేలుడు సంభవించింది. పంజాబ్‌లోని పోలీస్ స్టేషన్లవద్ద వరుస పేలుడు ఘటనలు జరగడం కలకలం రేపుతోంది. రాష్ట్రంలోని పోలీస్‌స్టేషన్‌లలో ఇటువంటి ఘటనలు చోటుచేసుకోవడం ఇది ఆరోసారి కావడం గమనార్హం. పేలుడు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుమల లడ్డూ కల్తీలో మరో ట్విస్టు..
ఢిల్లీలో మరోసారి గ్రాఫ్ 4 పై ఆంక్షలు..
అధికారులకు సంబంధం లేదు.. పూర్తి బాధ్యత నాదే: కేటీఆర్
ఆమె కోసం ప్రత్యేకమైన అంబులెన్స్.. వైద్య సిబ్బంది..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Dec 17 , 2024 | 11:39 AM