Kejriwal : వైద్య పరీక్షల కోసం బెయిల్ పొడిగించండి
ABN, Publish Date - May 28 , 2024 | 06:00 AM
తన మధ్యంతర బెయిల్‌ను మరో వారం రోజుల పాటు పొడిగించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు ‘తీవ్ర అనారోగ్య సమస్యలు’ ఉన్నాయని, వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉందని, బెయిల్‌ను పొడిగించాలని పిటిషన్‌లో కోరారు.
న్యూఢిల్లీ, మే 27 (ఆంధ్రజ్యోతి): తన మధ్యంతర బెయిల్‌ను మరో వారం రోజుల పాటు పొడిగించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు ‘తీవ్ర అనారోగ్య సమస్యలు’ ఉన్నాయని, వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉందని, బెయిల్‌ను పొడిగించాలని పిటిషన్‌లో కోరారు. మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మే 10న 21 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. జూన్ 2న మళ్లీ తిహాడ్ జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని అప్పుడే సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఆయన బెయిల్ పొడిగింపు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అనారోగ్య సమస్యల కారణంగా తాను ఏడు కేజీల బరువు తగ్గానని పిటిషన్‌లో పేర్కొన్నారు. కెటోన్ లెవల్స్ చాలా పెరిగాయన్నారు. కేజ్రీవాల్ అభ్యర్థనను ఓ డ్రామాగా బీజేపీ కొట్టిపారేసింది. ఎన్నికల ప్రచారం పూర్తై, జైలుకు వెళ్లాల్సిన సమయం రాగానే అనారోగ్యం గుర్తొచ్చిందా అని ఎద్దేవా చేసింది.
Updated Date - May 28 , 2024 | 06:01 AM