ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉగ్రదాడుల్ని ఇంకెంత మాత్రమూ సహించం

ABN, Publish Date - Oct 28 , 2024 | 04:15 AM

ఉగ్రవాదంపై భారత వైఖరి బలంగా ఉందని విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ స్పష్టం చేశారు.

  • ముంబై ఉగ్రదాడిపై నాడు స్పందన లేదు

  • మళ్లీ జరిగితే ప్రతిస్పందన ఉంటుంది: ఎస్‌.జైశంకర్‌

ముంబై, అక్టోబరు 27: ఉగ్రవాదంపై భారత వైఖరి బలంగా ఉందని విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ స్పష్టం చేశారు. 26/11 ముంబై ఉగ్రదాడి తరహా ఘటనలు మళ్లీ జరిగితే గనుక ప్రతిస్పందన ఉంటుందని తేల్చిచెప్పారు. మహారాష్ట్రలో డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. అంతర్జాతీయ వేదికపై దేశ ప్రతిష్ఠను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ముంబైలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘ముంబైలో జరిగినది(26/11) మరో మారు జరగకూడదు. అప్పుడు ఉగ్రదాడి జరిగింది. దానిపై స్పందన లేదు. దీన్ని భారత్‌ ఆమోదించదు. వచ్చిన మార్పు ఇదే. నేడు ఉగ్రవాదంపై పోరులో మేం నాయకులం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌ బలంగా నిలిచిందని ప్రజలకు తెలుసు’ అన్నారు. పగటి పూట సాధారణ కార్యకలాపాలు నిర్వహిస్తూనే, రాత్రి వేళ ఉగ్రవాదాన్ని పెంచిపోషించే దేశాలను భారత్‌ సహించబోదని ఆయన తేల్చిచెప్పారు.

Updated Date - Oct 28 , 2024 | 04:15 AM