ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mukesh Sahanis father murder: బీహార్‌‌లో వీఐపీ పార్టీ చీఫ్ ముకేశ్ సహానీ తండ్రి దారుణహత్య

ABN, Publish Date - Jul 16 , 2024 | 01:56 PM

బీహార్‌లో ఇండియా కూటమి భాగస్వామ్య వికాశీల్ ఇన్సాన్ పార్టీ (VIP) చీఫ్ ముకేవ్ సహానీ తండ్రి జితన్ సహానీ దారుణ హత్యకు గురయ్యారు. దర్భంగా జిల్లా సుపాల్ బజార్‌లోని సొంత ఇంట్లో జితన్ సహానీని దండుగుల దారుణంగా నరికి చంపేశారు. మంగళవారం ఉదయం మంచంపై ఆయన మృతదేహాన్ని గుర్తించారు.

పాట్నా: బీహార్‌లో ఇండియా కూటమి భాగస్వామ్య వికాశీల్ ఇన్సాన్ పార్టీ (VIP) చీఫ్ ముకేవ్ సహానీ తండ్రి జితన్ సహానీ దారుణ హత్యకు గురయ్యారు. దర్భంగా జిల్లా సుపాల్ బజార్‌లోని సొంత ఇంట్లో జితన్ సహానీని దండుగుల దారుణంగా నరికి చంపేశారు. మంగళవారం ఉదయం మంచంపై ఆయన మృతదేహాన్ని గుర్తించారు. జితన్ సహానీ హత్యకు గురయ్యారనే విషయాన్ని జిల్లా సీనియర్ పోలీసు అధికారి జగన్నాథ్ రెడ్డి ధృవీకరించారు. విచారణ కోసం పోలీసు బృందాన్ని రంగంలోకి దింపినట్టు ఆయన చెప్పారు. కాగా ఈ హత్య స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కాగా తండ్రి హత్యకు గురైన నివాసానికి ముఖేశ్ సహానీ నివాసం కూడా సమీపంలోనే ఉంది.


కాగా ఈ హత్యపై దర్యాప్తు కోసం ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సీనియర్ అధికారి జగన్నాథ్ రెడ్డి వెల్లడించారు. జితన్ సహానీకి శతృవులు ఎవరూ లేరని, దొంగతనం ప్రయత్నంలో హత్య చేసి ఉండొచ్చనే అనుమానం ఉందని చెప్పారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.


వీఐపీ పార్టీ చీఫ్ గతంలో బీహార్ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం పార్టీ చీఫ్‌గా ఉన్నారు. ఈ పార్టీకి ఓబీసీ కమ్యూనిటీలో బలమైన మద్దతు ఉంది. ఈ పార్టీ ప్రస్తుతం ఇండియా కూటమిలో ఉంది. ఆర్జేడీ, కాంగ్రెస్‌ పార్టీలతో రాష్ట్రంలో పొత్తు పెట్టుకుంది. జితన్ సహానీని హత్య చేయడంపై ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించింది. ఈ హత్య రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆర్జేడీ అధికార ప్రతినిధి శక్తి యాదవ్ అన్నారు. ‘‘బీహార్‌లో ఏం జరుగుతోంది. హత్య వార్త లేకుండా ఒక్కరోజు కూడా గడవడం లేదు. చేతకాని ప్రభుత్వం అధికారంలో ఉంది. వ్యవస్థ కుప్పకూలింది’’ అని విమర్శించారు.

Updated Date - Jul 16 , 2024 | 01:58 PM

Advertising
Advertising
<