ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Jharkhand: ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. హేమంత్ సోరెన్ సవాల్..

ABN, Publish Date - Feb 05 , 2024 | 02:17 PM

పటిష్ఠ బందోబస్తు మధ్య జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈరోజు అసెంబ్లీకి చేరుకున్నారు. తన అరెస్టులో రాజ్ భవన్ పాత్ర కూడా ఉందని ఆరోపించారు.

పటిష్ఠ బందోబస్తు మధ్య జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈరోజు అసెంబ్లీకి చేరుకున్నారు. తన అరెస్టులో రాజ్ భవన్ పాత్ర కూడా ఉందని ఆరోపించారు. జనవరి 31వ తేదీ రాత్రి దేశంలోనే తొలిసారిగా ఓ ముఖ్యమంత్రిని అరెస్టు చేశారని, ఇది దేశ చరిత్రలో మాయని అధ్యాయంగా మిగిలిపోతుందని చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని బీజేపీకి సవాల్ విసిరారు. జార్ఖండ్‌లో అధికార జేఎంఎం కూటమి శాసనసభాపక్ష నేత చంపై సోరెన్‌ కు తమ పూర్తి మద్దతు ఉందని స్పష్టం చేశారు.

జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) అధ్యక్షుడు హేమంత్ సోరెన్‌ను విశ్వాస ఓటింగ్‌లో పాల్గొనడానికి రాంచీలోని ప్రత్యేక కోర్టు అనుమతించింది. తాను అసెంబ్లీ సభ్యుడినని, తన పార్టీకి అత్యంత కీలకమైన ఈ సమయంలో తీర్మాన ప్రక్రియలో పాల్గొనే హక్కు తనకు ఉందని సోరెన్ కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన కోర్టు హేమంత్ సోరెన్ కు విశ్వాస తీర్మానంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించింది.


కాగా.. ₹600 కోట్ల భూ కుంభకోణంలో హేమంత్ సోరెన్ ప్రమేయం ఉందని ఈడీ ఆరోపించింది. ఈ కేసులో ప్రభుత్వ భూమి యాజమాన్యాన్ని మార్చడానికి, బిల్డర్లకు అమ్మేందుకు భారీగా సంప్రదింపులు జరిగాయని తెలిపింది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా, రాంచీ డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన 2011 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఛవీ రంజన్ సహా ఈ కేసులో ఇప్పటి వరకు 14 మందిని ఈడీ అరెస్టు చేసింది.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 05 , 2024 | 02:17 PM

Advertising
Advertising