ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Cyclone : పెద్దపాదం మార్గం బంద్‌

ABN, Publish Date - Dec 03 , 2024 | 04:22 AM

ఫెంజల్‌ తుఫాన్‌ ప్రభావం శబరిమల యాత్రపైనా పడింది.

పులిమేడు రూట్‌లో రెడ్‌ అలర్ట్‌

పంపా, సన్నిధానానికి ఎల్లో అలర్ట్‌

శబరిమలలో భారీ వర్షాలు

శబరిమల, డిసెంబరు 2: ఫెంజల్‌ తుఫాన్‌ ప్రభావం శబరిమల యాత్రపైనా పడింది. రెండ్రోజులుగా తెరిపినివ్వకుండా వర్షాలు కురుస్తుండడం.. మంగళ, బుధవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరికలను జారీ చేయడంతో.. అయ్యప్ప భక్తుల వనయాత్రలను నిషేధించారు. కేవలం పంపా బేస్‌ నుంచి మాత్రమే యాత్రకు అనుమతిస్తున్నారు. శబరిమలకు చేరుకునేందుకు ప్రధానంగా మూడు మార్గాలుంటాయి. అవి.. పులిమేడు మార్గం, ఎరుమేళి నుంచి పెద్దపాదం మార్గం, పంపా బేస్‌ నుంచి చిన్నపాదం మార్గాలు. ఫెంజల్‌ తుఫాన్‌ ప్రభావంతో మంగళ, బుధవారాల్లో మలప్పురం, కోళిక్కోడ్‌, వయనాడ్‌, కన్నూర్‌, ఇడుక్కి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ అయ్యింది. ఈ నేపథ్యంలో వండిపెరియార్‌ నుంచి పులిమేడ్‌ మార్గాన్ని మూసివేసినట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటికే ఈ మార్గంలోని కుజుత్తకులి వద్ద 12 మంది భక్తులు చిక్కుకుపోగా.. వారిని జాతీయ విపత్తు నిర్వహణ బృందం(ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ) కాపాడింది. ఈ మార్గమంతా చిత్తడిగా మారడంతో.. చిన్నపాటి లోయలోకి జారిపడ్డ ఇద్దరు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. ఎరుమేళి నుంచి పెద్దపాదం మార్గాన్ని కూడా అధికారులు మూసివేశారు.


ఈ మార్గంలో కాలికట్టై ఆశ్రమం, అజుతా వద్ద చిక్కుకుపోయిన 450 మంది భక్తులను ఎరుమేలికి.. అక్కడి నుంచి 11 బస్సుల్లో పంపాబే్‌సకు తరలించారు. తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు.. పులిమేడు, పెద్దపాదం మార్గాల్లో వనయాత్రను నిషేధించారు. రాత్రిళ్లు శబరి కొండపై రాకపోకలను నిషేధించారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదాలుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎరుమేలి పుంగావనంలో స్నానాలను నిషేధించినట్లు, పంపాలో హైఅలర్ట్‌ కొనసాగుతోందని ప్రకటించారు. కాగా, భారీ వర్షాల నేపథ్యంలో శబరిమల భక్తులకు భద్రత కల్పించాలని కేరళ హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో శబరిమల స్పెషలాఫీసర్‌ నాయర్‌ నేతృత్వంలో వివిధ శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అధికారులు ప్రస్తుత పరిస్థితులను సమీక్షించారు. వరద ఉధృతి పెరిగితే.. పంపాలో స్నానాలను నిషేధించాలని నిర్ణయించారు.

Updated Date - Dec 03 , 2024 | 04:51 AM