ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Watch Video: కారు బీభత్సం.. ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి..

ABN, Publish Date - Apr 10 , 2024 | 05:38 PM

తమిళనాడులో ఓ కారు బుధవారం ఉదయం బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు, మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మధురై జిల్లాలోని విరుదునగర్ - మధురై నాలుగు లేన్ల జాతీయ రహదారిపై శివరకోట్టై వద్ద ఈ ప్రమాదం జరిగింది.

మధురై: తమిళనాడులో(Tamilnadu) ఓ కారు బుధవారం ఉదయం బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు, మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మధురై జిల్లాలోని విరుదునగర్ - మధురై నాలుగు లేన్ల జాతీయ రహదారిపై శివరకోట్టై వద్ద ఈ ప్రమాదం జరిగింది.

విల్లాపురానికి చెందిన కనకవేల్ (62), అతని భార్య కృష్ణకుమారి (58), కోడలు నాగజ్యోతి (28), ఎనిమిదేళ్ల మనవడు కలిసి కారులో తాళవాయిపురానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో శివరకోట్టై వద్దకు చేరుకోగానే కారు అదుపుతప్పింది. దీంతో పక్కనే ఉన్న రెయిలింగ్‌పైకి దూసుకెళ్లి, ఎదురుగా వెళ్తున్న పాండి(55)అనే పండ్ల విక్రయదారుడిని ఢీకొట్టింది. కారు వేగం ధాటికి పాండి 100 మీటర్ల దూరం వరకు ఎగిరిపడ్డాడు.


తీవ్ర గాయాలపాలైన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పాండిని ఢీ కొట్టిన తరువాత కారు.. పక్కనే ఉన్న డివైడర్‌పై నుంచి అవతలి వైపు ఉన్న రెయలింగ్‌పైకి దూసుకెళ్లింది. కారు వేగం ఎక్కువగా ఉండటంతో గుర్తుపట్టరానంతగా ధ్వంసమైంది. కారులోని నలుగురూ మృత్యు ఒడికి చేరుకున్నారు. ఈ ఘటన తాలూకూ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. బ్రేకులు ఫెయిల్ కావడం ప్రమాదం జరగడానికి ప్రధాన కారణంగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రోడ్డు ప్రమాదంపై గగుర్పొడ్చే వీడియో ఇక్కడ ఉంది చూడండి..

Updated Date - Apr 10 , 2024 | 06:43 PM

Advertising
Advertising