ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పాక్‌కు.. రాహుల్‌, అఖిలేశ్‌ జై

ABN, Publish Date - May 23 , 2024 | 06:08 AM

కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీలు పాకిస్థాన్‌కు మద్దతు ఇస్తున్నాయని, ఆ దేశం వద్ద ఉన్న అణుబాంబును చూపించి భారత్‌ను భయపెడుతున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో ఆరో విడత ఎన్నికలు జరిగే పలు నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్‌, అఖిలేశ్‌

కూటమి గెలిస్తే రాముడు మళ్లీ గుడారాల్లోకే

యూపీ ప్రచార సభల్లో ప్రధాని మోదీ ఫైర్‌

లఖ్‌నవూ, మే 22: కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీలు పాకిస్థాన్‌కు మద్దతు ఇస్తున్నాయని, ఆ దేశం వద్ద ఉన్న అణుబాంబును చూపించి భారత్‌ను భయపెడుతున్నాయని ప్రధాని మోదీ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్‌లో ఆరో విడత ఎన్నికలు జరిగే పలు నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్‌, అఖిలేశ్‌ యాదవ్‌లపై విరుచుకుపడ్డారు. ‘‘రాహుల్‌, అఖిలేశ్‌ 2017లో కలిసి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి పరాజయం పాలయ్యారు. ఒకసారి ఫ్లాప్‌ అయిన ‘ఇద్దరు రాకుమారులు’ సినిమాను తిరిగి తెరపైకి తీసుకురావడం నాకు ఆశ్చర్యం కలిగించింది’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఇండియా కూటమి యూపీలో 79 సీట్లు గెలవనున్నదన్న అఖిలేఖ్‌ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. నిద్రపోతున్న కూటమి నేతల మత్తును జూన్‌ 4న యూపీ ప్రజలు వదిలిస్తారని, అప్పుడు వాళ్లు తమ ఓటమికి ఈవీఎంలను దూషిస్తారని ఎద్దేవా చేశారు. సోనియాగాంధీ ఏఐసీసీ అధ్యక్షురాలు అయినప్పుడు... అప్పటిదాకా ఆ స్థానంలో ఉన్న బీసీ నేత సీతారాం కేసరిని ఆ రోజంతా బాత్రూమ్‌లో బంధించారని, రాజ్యాంగాన్ని రద్దుచేసి కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండేళ్లపాటు ఎమర్జెన్సీని విధించిందని మోదీ విమర్శించారు. ఇండియా కూటమిని గెలిపిస్తే సనాతన ధర్మాన్ని రాహుల్‌, అఖిలేశ్‌ ధ్వంసం చేసేస్తారని, అయోధ్య ఆలయంలోని రాముడిని తిరిగి గుడారాల కిందకు చేరుస్తారని మోదీ ఆరోపించారు.

Updated Date - May 23 , 2024 | 06:08 AM

Advertising
Advertising