పరప్పన జైలు నుంచి రేవణ్ణ విడుదల
ABN, Publish Date - May 15 , 2024 | 03:44 AM
కిడ్నాప్ కేసులో జైలుకు వెళ్లిన కర్ణాటక మాజీ మంత్రి, హాసన్ జిల్లా హొళెనరసీపుర ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణ మంగళవారం విడుదలయ్యారు.
బెంగళూరు, మే 14(ఆంధ్రజ్యోతి): కిడ్నాప్ కేసులో జైలుకు వెళ్లిన కర్ణాటక మాజీ మంత్రి, హాసన్ జిల్లా హొళెనరసీపుర ఎమ్మెల్యే హెచ్డీ రేవణ్ణ మంగళవారం విడుదలయ్యారు.
బెయిల్ సోమవారం సాయంత్రం మంజూరైనా, న్యాయపరంగా సాంకేతిక అంశాలు పూర్తి కావడం జాప్యం కావడంతో బయటకు రాలేకపోయారు. మధ్యాహ్నం 12.45 గంటలకు రేవణ్ణ బెయిల్ ప్రక్రియ పూర్తయింది. 1.30 గంటలకు పరప్పన అగ్రహార జైలు నుంచి రేవణ్ణ బయటకు వచ్చి నేరుగా ఇంటికి బయల్దేరారు.
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ రాసలీలల పెన్‌డ్రైవ్ వివాదానికి అనుబంధంగా, ఫిర్యాదు చేసిన మహిళను కిడ్నాప్ చేశారనే కారణంగా ఈనెల 4న సిట్ అధికారులు రేవణ్ణను అరెస్టు చేశారు.
Updated Date - May 15 , 2024 | 06:17 AM