NEET Exam: నీట్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. మరో రెండు రోజుల్లో పరీక్ష తేదీల ప్రకటన
ABN, Publish Date - Jun 29 , 2024 | 07:19 PM
నీట్-పీజీ పరీక్షల(NEET - PG Exams) కొత్త షెడ్యూల్‌ను మరో రెండు రోజుల్లో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (NBE) ప్రకటిస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan) శనివారం వెల్లడించారు.
ఢిల్లీ: నీట్-పీజీ పరీక్షల(NEET - PG Exams) కొత్త షెడ్యూల్‌ను మరో రెండు రోజుల్లో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (NBE) ప్రకటిస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Dharmendra Pradhan) శనివారం వెల్లడించారు. పోటీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ముందస్తు చర్యగా గత వారం నీట్ పీజీ పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే. హరియాణాలో ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ.. ఒకట్రెండు రోజుల్లో పరీక్షల నిర్వహణ తేదీలను ప్రకటించనున్నట్లు చెప్పారు.
డార్క్‌నెట్‌లో ప్రశ్నపత్రం లీక్ అయిందని, టెలిగ్రామ్ యాప్‌లో సర్క్యులేట్ అయ్యిందని ప్రధాన్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరుపుతోందని తెలిపారు. UGC-NET అనేది జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అవార్డుకు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం, PhD కోర్సులలో ప్రవేశానికి నిర్వహించే అర్హత పరీక్ష. ఈ సారి ఆఫ్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించారు. యూజీసీ నెట్ పరీక్షలు కూడా రద్దు కావడంతో వాటిని జులై 25 నుంచి 27 వరకు జరపాలని విద్యాశాఖ నిర్ణయించింది.
Latest Telugu News And National News
Updated Date - Jun 29 , 2024 | 07:20 PM