Online Game: ఆన్‌లైన్ గేమ్‌కి బానిసైన కొడుకు.. ఇంట్లో తండ్రి లేని టైంలో కన్నతల్లినే..
ABN, Publish Date - Feb 25 , 2024 | 06:33 PM
ఆన్‌లైన్ గేమింగ్‌కి (Online Gaming) బానిసై, అప్పుల్లో కూరుకుపోయిన ఓ యువకుడు.. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఓ దారుణానికి ఒడిగట్టాడు. అప్పులు తీర్చేందుకు కన్నతల్లినే కడతేర్చాడు. ముందుగానే తల్లిదండ్రుల పేరుపై ఇన్సూరెన్స్ (Insurance) చేయించిన ఆ కిరాతకుడు.. ఆ డబ్బులను క్లెయిమ్ చేయడం కోసం పేరెంట్స్‌ని చంపాలని పక్కా ప్లాన్ చేశాడు. ఈ క్రమంలోనే అతడు తల్లిని హతమార్చాడు.
ఆన్‌లైన్ గేమింగ్‌కి (Online Gaming) బానిసై, అప్పుల్లో కూరుకుపోయిన ఓ యువకుడు.. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే ఓ దారుణానికి ఒడిగట్టాడు. అప్పులు తీర్చేందుకు కన్నతల్లినే కడతేర్చాడు. ముందుగానే తల్లిదండ్రుల పేరుపై ఇన్సూరెన్స్ (Insurance) చేయించిన ఆ కిరాతకుడు.. ఆ డబ్బులను క్లెయిమ్ చేయడం కోసం పేరెంట్స్‌ని చంపాలని పక్కా ప్లాన్ చేశాడు. ఈ క్రమంలోనే అతడు తల్లిని హతమార్చాడు. చివరికి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో (Uttar Pradesh) చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
హిమాన్షు (Himanshu) అనే కుర్రాడు ‘జూపీ’ (Zupee) అనే యాప్‌లో ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసయ్యాడు. ఆ గేమ్‌లో పదేపదే నష్టపోవడంతో అతడు పెద్ద మొత్తంలో అప్పు చేశాడు. ఆ అప్పు తీర్చేందుకు అతడు తన స్నేహితుల వద్ద నుంచి మళ్లీ రూ.4 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అయితే.. స్నేహితులు కూడా తమ డబ్బులు తిరిగివ్వాలని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. అప్పుడే అతడు ఒక ప్రణాళిక రచించాడు. తన తల్లిదండ్రులపై రూ.50 లక్షలు చొప్పున ఇన్సూరెన్స్ చేయించి, వాళ్లని చంపి ఆ డబ్బుల్ని క్లెయిమ్ చేయాలని భావించాడు. ప్లాన్ ప్రకారం.. 2023 డిసెంబర్‌లో తన పేరెంట్స్‌పై రూ.50 లక్షల జీవితా బీమాని కొనుగోలు చేశాడు. అది కూడా తన కుటుంబంలోని ఆభరణాలను దొంగతనం చేసి, వాటిని అమ్మిన తర్వాత వచ్చిన డబ్బుతో అతడు బీమా పాలసీలు కొన్నాడు. ఇక అప్పటి నుంచి తన తల్లిదండ్రుల్ని చంపేందుకు సరైన సమయం కోసం వేచి చూశాడు.
ఇటీవల తన తండ్రి రోషన్ సింగ్ (Roshan Singh) చిత్రకూట్‌లో ఉన్న హనుమాన్ ఆలయాన్ని సందర్శించడానికి వెళ్లాడు. తన తల్లి ప్రభ (50)ని చంపడానికి ఇదే సరైన సమయమని భావించి.. ఆమెను చంపేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా నటించాడు. రోషన్ సింగ్ తిరిగొచ్చాక తన భార్య కనిపించకపోవడంతో.. హిమాన్షుని నిలదీశాడు. నాకేం తెలియదని అతడు అబద్ధం చెప్పాడు. అప్పుడు ఇరుగుపొరుగు వారిని విచారించగా.. తాము నది ఒడ్డున హిమాన్షుని ట్రాక్టర్‌తో చూశామని అన్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. ఫిబ్రవరి 21వ తేదీన నది ఒడ్డున వెళ్లి పరిశీలించగా.. అక్కడ ప్రభ మృతదేహం కనిపించింది. దీంతో.. పోలీసులు హిమాన్షుని అరెస్టు చేశారు. విచారణలో భాగంగా.. ఆన్‌లైన్ గేమింగ్‌కి బానిసై తాను అప్పులు చేశానని, వాటిని తీర్చేందుకే తల్లిని చంపి ఇన్సూరెన్స్ పొందాలని అనుకున్నానని హిమాన్షు నేరం అంగీకరించాడు.
Updated Date - Feb 25 , 2024 | 06:33 PM