ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gaza : హమాస్‌పై ఇజ్రాయెల్‌ దాడులు

ABN, Publish Date - Jul 14 , 2024 | 04:59 AM

హమాస్‌ మిలటరీ కమాండర్‌ మహమ్మద్‌ దెయిఫ్‌ లక్ష్యంగా దక్షిణ గాజాలోని ఖాన్‌ యూనిస్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో 71 మంది మృతి చెందారు. 289 మంది గాయపడ్డారు. అయితే దాడిలో మహమ్మద్‌ దెయిఫ్‌ చనిపోయాడో లేదో తెలియలేదు.

  • 71 మంది మృతి.. 289 మందికి గాయాలు

  • హమాస్‌ మిలిటరీ కమాండర్‌ లక్ష్యంగానే దాడులన్న ఇజ్రాయెల్‌

జెరూసలేం, జూలై 13 : హమాస్‌ మిలటరీ కమాండర్‌ మహమ్మద్‌ దెయిఫ్‌ లక్ష్యంగా దక్షిణ గాజాలోని ఖాన్‌ యూనిస్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన దాడిలో 71 మంది మృతి చెందారు. 289 మంది గాయపడ్డారు. అయితే దాడిలో మహమ్మద్‌ దెయిఫ్‌ చనిపోయాడో లేదో తెలియలేదు. దెయిఫ్‌, హమాస్‌ మరో కమాండర్‌ రఫా సలామాలే దాడిలో తమ లక్ష్యమని ఇజ్రాయెల్‌ అధికారులు ప్రకటించారు.

హమాస్‌ ఈ వాదనను తిరస్కరించింది. ఈ దాడిని సామూహిక హత్యాకాండగా అభివర్ణించింది. చనిపోయిన వారిలో అత్యవసర సేవలు అందించేవారు కూడా ఉన్నట్లు పేర్కొంది. యుద్ధంతో నిరాశ్రయులైనవారు ఖాన్‌ యూనిస్‌లో టెంట్లతో వేసిన క్యాంపుల్లో ఉంటుండగా వారిపై భారీ ఎత్తున బాంబులతో ఇజ్రాయెల్‌ విరుచుకుపడిందని ఆరోపించింది.

ఈమేరకు హమాస్‌ నడుపుతోన్న గాజా ప్రభుత్వ మీడియా కార్యాలయం ఒక ప్రకటన వెలువరించింది. కాగా గత ఏడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై జరిగిన ఆకస్మిక దాడికి ప్రధాన సూత్రధారి దెయిఫేనని పలువురి అభిప్రాయం. ఈ దాడిలో 1,200 మంది మృతి చెందారు. ఈ ఘటనే ఇజ్రాయెల్‌-హమాస్‌ల యుద్ధానికి దారితీసింది. దెయిఫ్‌ ఏళ్లుగా ఇజ్రాయెల్‌ మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో ఉన్నాడు.

ఇతడిని చంపేందుకు ఇజ్రాయెల్‌ గతంలో జరిపిన పలు దాడులను తప్పించుకొన్నాడని సమాచారం. అయితే ఈ కారణంగా కదలలేని స్థితికి చేరుకున్నట్లు అంచనా. రెండు దశాబ్దాలుగా అతడు రహస్య జీవితం గడుపుతున్నాడు. 9 నెలలుగా ఇజ్రాయెల్‌ జరుపుతోన్న దాడుల్లో ఇతడి నిర్మూలన ఘన విజయంగా భావిస్తున్నారు.

Updated Date - Jul 14 , 2024 | 04:59 AM

Advertising
Advertising
<