ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

500కే సిలిండర్‌.. 75కే లీటర్‌ పెట్రోల్‌

ABN, Publish Date - Mar 21 , 2024 | 06:11 AM

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తమిళనాడులోని అధికారపక్షం డీఎంకే ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. డీఎంకే మహిళా విభాగం నాయకురాలు కనిమొళి నాయకత్వంలో ఏర్పాటైన ప్రత్యేక కమిటీ ఈ మ్యానిఫెస్టోను రూపొందించింది. స్టాలిన్‌ మ్యానిఫెస్టోను ఆవిష్కరించారు. ప్రతిపక్ష ఇండియా కూటమి లోక్‌సభ ఎన్నికల్లో గెలిస్తే

రైతు రుణాలు వడ్డీ సహా మాఫీ

గృహిణులకు నెలకు రూ.వెయ్యి

డీఎంకే మ్యానిఫెస్టోలో వరాలు

చెన్నై, మార్చి 20(ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి తమిళనాడులోని అధికారపక్షం డీఎంకే ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. డీఎంకే మహిళా విభాగం నాయకురాలు కనిమొళి నాయకత్వంలో ఏర్పాటైన ప్రత్యేక కమిటీ ఈ మ్యానిఫెస్టోను రూపొందించింది. స్టాలిన్‌ మ్యానిఫెస్టోను ఆవిష్కరించారు. ప్రతిపక్ష ఇండియా కూటమి లోక్‌సభ ఎన్నికల్లో గెలిస్తే పౌరసత్వ సవరణ చట్టం-2019(సీఏఏ)ను రద్దు చేస్తామని ప్రకటించారు. అలాగే, జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామన్నారు. వంటగ్యాస్‌ సిలిండర్‌ను రూ.500కే ఇస్తామని, లీటరు పెట్రోలు రూ.75, డీజిల్‌ రూ.65కు అందజేస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా రైతుల రుణాలు వడ్డీతో సహా మాఫీ చేస్తామని, అన్ని రాష్ట్రాల్లో గృహిణులకు ప్రతినెలా రూ.1,000 అందజేస్తామని పేర్కొన్నారు. గవర్నర్‌ వ్యవస్థ రద్దుకు కృషి చేస్తామని, నీతి ఆయోగ్‌ను రద్దు చేస్తామని, హైవేలపై టోల్‌గేట్లను రద్దు చేస్తామని ప్రకటించారు. తమిళనాడులో నీట్‌ను రద్దు చేస్తామని, శ్రీలంక తమిళులకు భారత పౌరసత్వం ఇస్తామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా బడిపిల్లలందరికీ ఉదయం అల్పాహారం అందజేస్తామని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కోసం స్వామినాథన్‌ సిఫారసులు అమలు చేస్తామన్నారు.

Updated Date - Mar 21 , 2024 | 06:11 AM

Advertising
Advertising