Gujarat Rains: ఇంటి పైకి చేరిన మొసలి
ABN, Publish Date - Aug 29 , 2024 | 11:43 AM
గుజరాత్‌లో ఎడతెరపి లేకుండా భారీ వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో వరద పోటెత్తింది. వడోదరాలో 10 నుంచి 12 అడుగుల మేర వరద నీరు నిలిచిపోయింది. పట్టణంలో అకోట స్టేడియం ప్రాంతంలోని ఓ ఇంటిపైకి మొసలి చేరింది. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
గాంధీనగర్, ఆగస్ట్ 29: గుజరాత్‌లో ఎడతెరపి లేకుండా భారీ వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో వరద పోటెత్తింది. వడోదరాలో 10 నుంచి 12 అడుగుల మేర వరద నీరు నిలిచిపోయింది. పట్టణంలో అకోట స్టేడియం ప్రాంతంలోని ఓ ఇంటిపైకి మొసలి చేరింది. అందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read: External Affairs Ministry :పాస్ట్‌పోర్ట్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం.. ఎన్ని రోజులంటే..
ఈ భారీ వర్షాలు, వరదల కారణంగా 35 మంది మరణించారు. అలాగే వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వారంత ఇంటి పైకప్పు ఎక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్, భారత సైన్యం, పోలీస్ శాఖ రంగంలోకి దిగింది. ఇప్పటికే దాదాపు 20 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.
Also Read: ఆన్‌లైన్ పాస్ పోర్ట్ సేవలు కొద్ది రోజుల పాటు బంద్
జామ్ నగర్ పరిధిలోని దాదాపు 71 గ్రామాలు వరద నీటిలో చిక్కుకు పోయాయి. ద్వారకాలో గత రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఇక బనియాద్ బ్లాక్‌లో గురువారం ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా.. వివిధ ప్రాంతాలు జలమయమయ్యాయి.
Also Read: Jharkhand: ‘ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్ర’
గుజరాత్‌లో భారీ వర్షాలు, వరదల కారణంగా చోటు చేసుకున్న పరిస్థితులపై ఆ రాష్ట్ర సీఎం భూపేంద్ర పటేల్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేసి ఆరా తీశారు. రాష్ట్రాన్ని కేంద్రం అన్ని విధాలా ఆదుకుంటుందని ఈ సందర్బంగా సీఎం హుడాకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.
Also Read: Haryana: సీఎం వ్యవహారంపై నిప్పులు చెరిగిన కాంగ్రెస్
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.
Updated Date - Aug 29 , 2024 | 11:43 AM