Gujarat: రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
ABN, Publish Date - Sep 29 , 2024 | 07:52 AM
పశువులను తప్పించే క్రమంలో బస్సు డివైడర్‌ను ఢీ కొట్టింది. ఆ క్రమంలో ఎదురుగా వస్తున్న వాహనాలపైకి బస్సు దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గుజరాత్‌లోని ద్వారక సమీపంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది.
గాంధీనగర్, సెప్టెంబర్ 29: పశువులను తప్పించే క్రమంలో బస్సు డివైడర్‌ను ఢీ కొట్టింది. ఆ క్రమంలో ఎదురుగా వస్తున్న వాహనాలపైకి బస్సు దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గుజరాత్‌లోని ద్వారక సమీపంలో శనివారం సాయంత్రం చోటు చేసుకుంది.
Also Read: Web Story: గోంగూర వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. అసలు వదిలి పెట్టరు
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం సహాయక చర్యల్లో భాగంగా క్షతగాత్రులను ద్వారకలోని ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, నలుగురు చిన్నారులతోపాటు ఒక యువకుడు ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
ఈ బస్సు ద్వారక నుంచి అహ్మదాబాద్ వెళ్తుండగా కంబాలియా జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. ఈ దుర్ఘటనలో బస్సు ఢీకొన్న మినీ వ్యాన్, బైక్, కారు పూర్తిగా ధ్వంసమయ్యాయని చెప్పారు.
మినీ వ్యాన్‌లోని ఆరుగురు, బస్సులోని ఓ ప్రయాణికుడు ఈ దుర్ఘటనలో మరణించారని వివరించారు. మృతులను గుర్తించినట్లు చెప్పారు. వీరి స్వస్థలం గాంధీనగర్‌లోని కలోల్ ప్రాంతమని తెలిపారు. మరొకరిది మాత్రం ద్వారక అన్నారు. ఈ ప్రమాదంపై కేసు పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
For National News And Telugu News..
Updated Date - Sep 29 , 2024 | 07:52 AM