ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gujarat Model: చికాగోలో టీచర్ గారు.. జీతం మాత్రం గుజరాత్‌లో..

ABN, Publish Date - Aug 09 , 2024 | 12:51 PM

గుజరాత్‌లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు.. అమెరికాలోని షికాగోలో నివసిస్తూ.. ఇక్కడ ప్రతి నెల జీతం అందుకుంటుంది. అలా ఒకటి రెండు మాసాలు కాదు.. ఏకంగా ఎనిమిదేళ్లుగా ఆమె జీతం తీసుకుంటుంది. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా.. ఆమెపై చర్యలు మాత్రం శూన్యం.

గాంధీనగర్, ఆగస్ట్ 09: దేశానికి గుజరాత్ మోడలే ఆదర్శమని కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు పలువురు తరచూ అభిప్రాయపడుతూ ఉంటారు. అయితే అదే గుజరాత్‌లో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు.. అమెరికాలోని షికాగోలో నివసిస్తూ.. ఇక్కడ ప్రతి నెల జీతం అందుకుంటుంది. అలా ఒకటి రెండు మాసాలు కాదు.. ఏకంగా ఎనిమిదేళ్లుగా ఆమె జీతం తీసుకుంటుంది. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా.. ఆమెపై చర్యలు మాత్రం శూన్యం.

Also Read: Bangladesh Violance: బంగ్లాదేశ్ నుంచి తిరిగి వచ్చిన 7,200 మంది భారతీయ విద్యార్థులు


బనస్‌కాంతా జిల్లా, అంబాజీ గ్రామంలోని ప్రాథమికోతన్న పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలిగా భవనాబెన్ పటేల్ గతంలో విధులు నిర్వహించారు. 2013లో ఆమె షికాగో వెళ్లిపోయారు. ఆమె గ్రీన్ కార్డును కూడా కలిగి ఉన్నారు. దీంతో ఏడాదికి ఒకసారి లేదా రెండేళ్లకు ఒకసారి స్వరాష్ట్రం గుజరాత్‌కు ఆమె వస్తారు. అదీకూడా దీపావళి పర్వదినం పురస్కరించుకుని భవనాబెన్ పటేల్ వస్తుంటారు. పండగ సమయం కావడంతో స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ఇస్తుంది. దీంతో ఆమెను ఇప్పటి వరకు కనీసం చూడను కూడా చూడలేదని విద్యార్థులు పేర్కొంటున్నారు.

Also Read: wayanad landslides: మూడు గంటల పాటు ఏకదాటిగా హరిణి శ్రీ భరత నాట్యం.. ఎందుకంటే..?


ఆమె దేశంలో లేకున్నా.. విధులకు హాజరుకాకున్నా.. భవనా బెన్ ఆమె పేరు మాత్రం రోస్టర్‌లో ఇంకా కొనసాగుతుందని ఆ పాఠశాల సిబ్బంది పేర్కొంటున్నారు. అంతేకాదు ప్రతి నెల ఠంచన్‌గా ఆమె బ్యాంక్ అకౌంట్‌లోకి నగదు సైతం షారా మామూలుగానే పడిపోతుందని పలువురు వివరిస్తున్నారు.

Laapataa Ladies' Movie: సుప్రీంకోర్టులో లాపతా లేడీస్ చిత్ర ప్రదర్శన.. హాజరుకానున్న ఆమిర్ ఖాన్ దంపతులు


ఈ విషయాన్ని పాఠశాలలోని ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లి ఫిర్యాదు సైతం చేశారు. ఆ క్రమంలో ఆమెపై ఎక్కడ ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఓ వేళ ఏమైనా ఆమెపై చర్యలు తీసుకున్నా.. అవి నామ మాత్రంగానే ఉంటాయని విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాలలోని సహచర ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.

Also Read: Odisha: విద్యార్థులకు అస్వస్థత.. దేశంలోనే తొలి రైస్ ఏటీఎం ఏర్పాటు


సదరు పాఠశాల ఇన్‌చార్జీ ఉపాధ్యాయులు పరుల్‌బెన్ మాట్లాడుతూ.. 2013లోనే భావనాబెన్ పటేల్ యూఎస్ వెళ్లిపోయారని తెలిపారు. ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి సైతం ఆమె తీసుకు వెళ్లినట్లు తెలిపారు. ఇక ఆ పాఠశాల విద్యార్థులు అయితే.. గత రెండోళ్లుగా ఆమెను ఒక్కసారి కూడా చూడ లేదని విద్యార్థులు ఈ సందర్భంగా పేర్కొంటున్నారు.

Also Read: Independence Day 2024: ఆగస్ట్ 15 వేళ.. బీజేపీ హర్ ఘర్ తిరంగా ప్రచార కార్యక్రమం


ఈ అంశంపై ప్రాథమిక విద్యాశాఖ అధికారి స్పందించారు. భావనాబెన్ పటేల్.. చివరిసారిగా జనవరి 2023లో పాఠశాలను సందర్శించారని తెలిపారు. ఈ ఏడాది నుంచి వేతనం లేని సెలవులో ఆమె ఉన్నారని సదరు అధికారి ధృవీకరించారు. మరోవైపు పటేల్‌కు షోకాజ్ నోటీసు జారీ చేసి క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 09 , 2024 | 12:51 PM

Advertising
Advertising
<