ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Drugs: అంతర్జాతీయ మాదకద్రవ్యాల రాకెట్‌ను ఛేదించిన అధికారులు

ABN, Publish Date - Feb 28 , 2024 | 09:18 AM

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మాదకద్రవ్యాల రాకెట్‌ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో, భారత నౌకాదళం ఛేదించింది. సంయుక్త ఆపరేషన్‌ చేపట్టిన అధికారులు 3,300 కేజీల మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకుని.. 5 గురిని అదుపులోకి తీసుకున్నారు.

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మాదకద్రవ్యాల రాకెట్‌ (International Drugs Racket)ను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (Narcotics Control Bureau ), భారత నౌకాదళం (Indian Navy) ఛేదించింది. సంయుక్త ఆపరేషన్‌ చేపట్టిన అధికారులు 3,300 కేజీల మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకుని.. 5 గురిని అదుపులోకి తీసుకున్నారు. నౌకాదళ అధికారులకు వచ్చిన సమాచారం ఆధారంగా మాదకద్రవ్య నియంత్రణ అధికారులతో కలిసి ఈ ఆపరేషన్ చేపట్టారు.

అనుమానాస్పదంగా భారత్‌లో సముద్ర జలాల్లోకి ప్రవేశించిన ఒక పడవను అధికారులు ముట్టడించారు. పడవలో 3089 కేజీల చరస్, 158 కేజీల మేథపేటమిన్, 25 కేజీల మొర్ఫిన్ ఉన్న మత్తు పదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకోవడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి. భారత్ సముద్ర జలాల్లోకి ప్రవేశించిన అనుమానాస్పద పడవను గస్తీలో ఉన్న నౌకాదళ హెలికాప్టర్ గుర్తించింది. హెలికాప్టర్‌లో ఉన్న సిబ్బంది ఇచ్చిన సమాచారంతో నౌకాదళ, ఎన్సీబీ అధికారులు పడవను చుట్టుముట్టి మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Updated Date - Feb 28 , 2024 | 09:19 AM

Advertising
Advertising