ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వినేశ్‌పై పోటీకి రెజ్లర్‌ను దింపిన ఆప్‌

ABN, Publish Date - Sep 12 , 2024 | 05:23 AM

రానున్న హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్‌ ఆద్మీ పార్టీ బుధవారం 20 మంది అభ్యర్థులతో తన రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ‘జులానా’ నియోజకవర్గం

జులానా, సెప్టెంబరు 11: రానున్న హరియాణా అసెంబ్లీ ఎన్నికలకు ఆమ్‌ ఆద్మీ పార్టీ బుధవారం 20 మంది అభ్యర్థులతో తన రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ‘జులానా’ నియోజకవర్గం నుంచి మాజీ రెజ్లర్‌ కవితా దలాల్‌ను బరిలోకి దింపనున్నట్లు ప్రకటించింది. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగాట్‌ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమెపై బీజేపీ తరఫున కెప్టెన్‌ యోగేశ్‌ బైరాగీ పోటీ చేస్తుండగా, ఆప్‌ కవితా దలాల్‌ను రంగంలోకి దింపింది. కవితా దలాల్‌ భారతదేశం తరఫున డబ్లూడబ్లూఈలో పాల్గొన్న మొదటి మహిళా రెజ్లర్‌గా గుర్తింపు పొందారు. హరియాణాలో ఆప్‌ కాంగ్రె్‌సతో కలిసి పోటీ చేస్తుందని ఊహించినప్పటికీ ఒంటరిగా బరిలోకి దిగింది.

Updated Date - Sep 12 , 2024 | 05:24 AM

Advertising
Advertising