ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hathras stampede: భోలే బాబా అనుచరుడిపై ప్రశ్నల వర్షం

ABN, Publish Date - Jul 06 , 2024 | 05:43 PM

ఉత్తరప్రదేశ్‌ హాథ్రాస్‌లో బోలే బాబా సత్సంగ్ సందర్బంగా జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించగా.. 28 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో బోలేబాబా ముఖ్య అనుచరుల్లో ఒకరైన దేవ్‌ప్రకాశ్ మధుకర్‌‌‌తోపాటు పలువురుపై సికిందరావు పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు.

లఖ్‌నవూ, జులై 07: ఉత్తరప్రదేశ్‌ హాథ్రాస్‌లో బోలే బాబా సత్సంగ్ సందర్బంగా జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించగా.. 28 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో బోలేబాబా ముఖ్య అనుచరుల్లో ఒకరైన దేవ్‌ప్రకాశ్ మధుకర్‌‌‌తోపాటు పలువురుపై సికిందరావు పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. దాంతో దేవ్‌ప్రకాశ్ మధుకర్ న్యూఢిల్లీలో లొంగిపోయారు. ఆయన్ని ఉత్తరప్రదేశ్‌ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా మధుకర్‌కు పోలీసులు పలు ప్రశ్నలు సంధించారు. అవి..

1) భోలే బాబాతో మీకు ఎప్పటి నుంచి పరిచయం ఉంది?

2) మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడ సత్సంగాలు నిర్వహించారు?

3) సత్సంగం నిర్వహించడానికి బడ్జెట్ ఎంతవుతుంది? విరాళం ఎంత వచ్చింది?

4) ఈ సత్సంగానికి ఎంతమంది హాజరవుతారని మీరు భావించారు. ఆ సంఖ్యను బాబాకు తెలిపారా? లేదా?

5) మీ లెక్క ప్రకారం సత్సంగానికి ఎంత మంది హాజరయ్యారు?

6) ఈ సత్సంగానికి వచ్చిన విరాళం ఎంత? ఆ విషయాన్ని బాబాకు తెలియజేశారా?

7) సత్సాంగానికి వచ్చిన విరాళాలు ఎవరి వద్ద ఉంచుతారు?

8) సత్సంగంలో తొక్కిసలాట ఎలా సంభవించింది?

9) సత్సంగం ముగిసిన అనంతరం భక్తుల సమూహంపై సేవాదార్లు లాఠీ‌ఛార్జ్ చేశారా?

10) ఈ ప్రమాదం అంటే.. ఈ తొక్కిసలాట జరిగిన సమయంలో మీరు ఎక్కడ ఉన్నారు?

11) సత్సంగం సందర్భంగా భద్రత కోసం ఎంత మందిని వినియోగించారు?

12) ఈ సత్సంగంలో సంఘ విద్రోహశక్తులు ఏమైనా ఉన్నాయనుకుంటున్నారా? ఓ వేళ ఉంటే వాటిని మీరు గమనించారా?

Also Read: KCR: రోజా ఇంట్లో చేపల పులుసు తిని..


13) ఈ తొక్కిసలాట వెనుక కుట్ర కోణం దాగి ఉందని మీకు ఏమైనా కనిపించిందా?

14) మీకు ఏదైనా రాజకీయ పార్టీతో సంబంధాలున్నాయా?

15) ఏదైనా రాజకీయ పార్టీ నేతలతో బోలే బాబాకు పరిచయాలు ఉన్నాయా? ఓ వేళ అలా ఉంటే.. బాబా నివాసానికి తరచు సందర్శించిన నాయకులు ఎవరు?

16) ఈ తొక్కిసలాట చోటు చేసుకున్న సమయంలో మీ భద్రతా సిబ్బంది మిమ్మల్ని సైతం నెట్టారా?

17) ఈ సత్సంగం ముగిసిన అనంతరం జరిగిన తొక్కిసలాటపై మీరు.. నారాయణ హరికి ఎప్పుడు తెలియజేశారు? మీరు చెబితే.. బాబా మీతో ఏం మాట్లాడారు?

18) ఈ ఘటన అనంతరం నారాయణ మరి ఎక్కడికి వెళ్లారు? ఆయన ఎక్కడ తల దాచుకున్నారు? ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు?

19) ఈ ఘటన అనంతరం మీరు, బాబా ఎన్నిసార్లు మాట్లాడుకున్నారు?

20) ఈ ఘటన తర్వాత మీరు తప్పించుకునే క్రమంలో ఎక్కడ తలదాచుకున్నారు? అలాగే ఎవరెవరిని కలిశారు?

21) ఢిల్లీలో ఎక్కడెక్కడ ఆశ్రయం పొందారు, ఎవరితో మాట్లాడారు?

22) ఎంతకాలంగా మీరు గుండె జబ్బుతో బాధపడుతున్నారు? ఆ వివరాలను చూపండి?

23) మీరు తలదాచుకోవడానికి వెళ్లినప్పుడు.. మీతో ఇంకా ఎవరెవరున్నారు? వారి వివరాలు ఇవ్వండి?

24) ఈ సత్సంగం సమయంలో మీరు కాకుండా ఇతర నిర్వాహకుల పాత్ర కూడా ఉందా? దీనికి సమాధానం చెప్పండి?

Also Read: Tamil Nadu: ఆర్మ్‌స్ట్రాంగ్ దారుణ హత్య.. స్పందించిన మాయావతి


Also Read: Rohit: కోట్లలో ఆస్తులు.. ఆడి కారు.. విమానంలో టూర్లు..

మరోవైపు ఈ కేసులో ఇప్పటి వరకు ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఇద్దరు మహిళలు సైతం ఉన్నారు. ఇంకోవైపు జులై 3వ తేదీన చోటు చేసుకున్న ఈ తొక్కిసలాట వెనుక కుట్ర దాగి ఉందంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో యోగి ప్రభుత్వం స్పందించింది. ఈ అంశంపై విచారణ చేపట్టాలని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి అధ్యక్షతన ముగ్గురు సభ్యుల కమిషన్‌ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం విధితమే.

For Latest News and National News click here

Updated Date - Jul 06 , 2024 | 05:47 PM

Advertising
Advertising
<