ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వరదలతో తెలుగు రాష్ట్రాలకు భారీ నష్టం: శివరాజ్‌

ABN, Publish Date - Sep 12 , 2024 | 05:10 AM

తెలంగాణ, ఆంద్రప్రదేశ్‌లో సంభవించిన వరదలతో రెండు రాష్ట్రాలకు భారీ నష్టం వాటిల్లిందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పేర్కొన్నారు.

న్యూఢిల్లీ, సెప్టెంబరు 11: తెలంగాణ, ఆంద్రప్రదేశ్‌లో సంభవించిన వరదలతో రెండు రాష్ట్రాలకు భారీ నష్టం వాటిల్లిందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. ప్రత్యేకించి పంటపొలాలు, పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇటీవల పర్యటించిన శివరాజ్‌సింగ్‌.. నష్టాన్ని స్వయంగా పరిశీలించడంతోపాటు కేంద్రం నుంచి తగిన సహాయం అందేలా కృషి చేస్తానని చెప్పారు. ఈ మేరకు బుధవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసి నివేదిక సమర్పించారు. వరదల వల్ల కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే 1.8 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లుగా అంచనా వేసినట్లు చెప్పారు. త్వరలోనే కేంద్ర బృందం రెండు రాష్ట్రాల్లో పర్యటిస్తుందని, నష్టాన్ని అంచనా వేస్తుందని శివరాజ్‌సింగ్‌ వెల్లడించారు.

Updated Date - Sep 12 , 2024 | 05:10 AM

Advertising
Advertising