Jharkhand: హేమంత్ సోరెన్ రాజీనామా.. కొత్త సీఎంగా చంపయి సోరెన్..
ABN, Publish Date - Jan 31 , 2024 | 09:48 PM
జార్ఖాండ్ ముఖ్యమంత్రి పదవికి హేమంత్ సోరెన్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో జార్ఖాండ్ కొత్త ముఖ్యమంత్రిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి చంపయి సోరెన్ ఎంపికయ్యారు. మనీలాండరింగ్ కేసులో బుధవారంనాడు 6 గంటల సేపు విచారణను ఎదుర్కొన్న హేమంత్ సోరెన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అదుపులోనికి తీసుకుంది.
రాంచీ: జార్ఖాండ్ ముఖ్యమంత్రి పదవికి హేమంత్ సోరెన్ (Hemant Soren) రాజీనామా (Resign) చేశారు. ఆయన స్థానంలో జార్ఖాండ్ కొత్త ముఖ్యమంత్రిగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి చంపయి సోరెన్ (Champai Soren) ఎంపికయ్యారు. మనీలాండరింగ్ కేసులో బుధవారంనాడు 6 గంటల సేపు విచారణను ఎదుర్కొన్న హేమంత్ సోరెన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అదుపులోనికి తీసుకుంది. దీంతో రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈడీ అధికారులతో కలిసి ఆయన గవర్నర్‌ను కలుసుకుని తన రాజీనామా లేఖను సమర్పించారు.
లెజస్లేటివ్ పార్టీ నేతగా చంపయి సోరెన్..
కాగా, తాజా పరిణామాల మధ్య జేఎంఎం ఎమ్మెల్యేలు రవాణా శాఖ మంత్రి చంపయి సోరెన్‌ను లెజిస్లేటివ్ పార్టీ నేతగా ఎన్నుకున్నారు. ప్రమాణస్వీకారానికి ఆహ్వానించాల్సిందిగా గవర్నర్‌ను కోరేందుకు తాము రాజ్‌భవన్‌కు వచ్చినట్టు జార్ఖాండ్ మంత్రి బన్నా గుప్తా తెలిపారు.
సోరెన్ రాజీనామా..
దీనికి ముందు, సీఎం పదవికి రాజీనామా చేయాలని హేమంత్ సోరెన్ నిర్ణయం తీసుకున్నట్టు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేష్ ఠాకూర్ తెలిపారు. చంపయి సోరెన్ లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎంపికయ్యారని, తామంతా ఆయనతోనే ఉన్నామని మీడియాకు చెప్పారు. ఈ విషయాన్ని జేఎంఎం ఎంపీ మహుమా మజి సైతం ధ్రువీకిరించారు. ''ఈడీ కస్టడీలో సీఎం ఉన్నారు. ఆయన రాజీనామా చేసేందుకు ఈడీ టీమ్‌తో కలిసి గవర్నర్ వద్దకు వెళ్లారు. చంపయి సోరెన్ కొత్త సీఎం కానున్నారు. మాకు తగిన సంఖ్యా బలం ఉంది'' అని మహువా మజి తెలిపారు.
Updated Date - Jan 31 , 2024 | 09:48 PM