కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hero Surya: కెప్టెన్‌ సమాధి వద్ద హీరో సూర్య కన్నీరు.. కుటుంబ సభ్యులకు ఓదార్పు

ABN, Publish Date - Jan 06 , 2024 | 10:13 AM

సీనియర్‌ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు దివంగత కెప్టెన్‌ విజయకాంత్‌(Captain Vijayakanth) సమాధికి హీరో సూర్య(Hero Surya) కన్నీటితో నివాళి అర్పించారు. విజయకాంత్‌ చనిపోయిన సమయంలో ఆయన విదేశాల్లో ఉన్నారు.

Hero Surya: కెప్టెన్‌ సమాధి వద్ద హీరో సూర్య కన్నీరు.. కుటుంబ సభ్యులకు ఓదార్పు

అడయార్‌(చెన్నై): సీనియర్‌ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు దివంగత కెప్టెన్‌ విజయకాంత్‌(Captain Vijayakanth) సమాధికి హీరో సూర్య(Hero Surya) కన్నీటితో నివాళి అర్పించారు. విజయకాంత్‌ చనిపోయిన సమయంలో ఆయన విదేశాల్లో ఉన్నారు. దీంతో కెప్టెన్‌ పార్థివదేహానికి చివరిసారి చూసి నివాళి అర్పించలేకపోయారు. శుక్రవారం విదేశాల నుంచి చెన్నైకి తిరిగి వచ్చిన ఆయన.. స్థానిక కోయంబేడులోని డీఎండీకే ప్రధాన కార్యాలయంలో ఉన్న కెప్టెన్‌ సమాధి వద్దకు వెళ్ళి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీరు కారుస్తూనే కెప్టెన్‌ సమాధికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఆ తర్వాత సమాధి వద్ద కూర్చొని రోదించారు. పిమ్మట... తన తండ్రి శివకుమార్‌, తమ్ముడు కార్తీతో కలిసి సాలిగ్రామంలోని కెప్టెన్‌ నివాసానికి వెళ్లి విజయకాంత్‌ చిత్రపటానికి నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.

nani6.jpg

Updated Date - Jan 06 , 2024 | 10:13 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising