Home » Surya
టీమిండియా టీ20 జట్టు కెప్టెన్‌గా పూర్తి స్థాయి బాధ్యతలు చేపట్టిన సూర్యకుమార్ యాదవ్ శ్రీలంక సిరీస్‌లో మెరిశాడు. శ్రీలంకతో శనివారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో జట్టును విజయపథాన నడిపించాడు. 26 బంతుల్లో 223 స్ట్రైక్ రేట్‌తో 58 పరుగులు చేశాడు. టీమిండియాకు భారీ స్కోరు అందించాడు.
భారత క్రికెట్ జట్టులో సభ్యుడిగా ఎన్నో విజయాలు అందించిన గౌతమ్ గంభీర్ కోచ్‌గా తన కొత్త బాధ్యతలను నిర్వహించడానికి సిద్ధమయ్యాడు. శ్రీలంకతో భారత్ మూడు మ్యాచ్‌ల టీ20 సీరిస్ ఆడనుంది. శనివారం మొదటి మ్యాచ్ జరగనుంది.
ప్రస్తుతం టీమిండియా శ్రీలంక పర్యటనలో ఉంది. శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడబోతోంది. ఈ సిరీస్‌తోనే గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా పూర్తి స్థాయి బాధ్యతలు స్వీకరించబోతున్నాడు. ఇక, సూర్యకుమార్ యాదవ్ టీ20 జట్టును నడిపించబోతున్నాడు. వీరిద్దరికీ ఎప్పట్నుంచో సాన్నిహిత్యం ఉంది.
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు వైస్-కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యాకు సెలక్షన్ కమిటీ తాజాగా షాకిచ్చింది. శ్రీలంకలో జరగబోయే వన్డే, టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన జట్లకు వైస్-కెప్టెన్ బాధ్యతల నుంచి తప్పించింది
టీ20 ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు రోహిత్ శర్మ వీడ్కోలు పలికాడు. దీంతో రోహిత్ స్థానంలో కెప్టెన్‌గా నియమితుడయ్యేది ఎవరంటూ పెద్ద చర్చ జరిగింది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యానే టీమిండియా టీ20 కెప్టెన్ అవుతాడని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా సూర్యకుమార్ యాదవ్ తెర పైకి వచ్చాడు.
ఇటీవల కాలంలో క్రికెట్లో అద్భుతమైన క్యాచ్ ఏది అని అడిగితే వెంటనే గుర్తొచ్చేది టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్. ఆ ఒక్క క్యాచ్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది.
టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ ఫైనల్ మ్యాచ్‌లో చివరి ఓవర్లో బౌండరీ లైన్ దగ్గర పట్టిన క్యాచ్‌ను అతడే కాదు.. అభిమానులు కూడా మర్చిపోలేరు. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ డేవిడ్ మిల్లర్ కొట్టిన బంతిని సూర్య అద్భుతమైన సమన్వయంతో పట్టుకున్నాడు.
ఉత్కంఠభరితంగా సాగుతున్న మ్యాచ్. దక్షిణాఫ్రికా విజయానికి చివరి ఆరు బంతుల్లో 16 పరుగులు అవసరం. క్రీజులో అరవీర భయంకర డేవిడ్ మిల్లర్. చివరి ఓవర్ వేసేందుకు హార్దిక్ బంతి అందుకున్నాడు. హార్దిక్ వేసిన తొలి బంతిని మిల్లర్ బలంగా కొట్టాడు. అది కచ్చితంగా సిక్స్ వెళ్లేలా కనిపించింది.
గతేడాది టీ-20 ఫార్మాట్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. ఐసీసీ ప్రకటించిన ``టీమ్ ఆఫ్ ది ఇయర్-2023`` కి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
సీనియర్ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు దివంగత కెప్టెన్ విజయకాంత్(Captain Vijayakanth) సమాధికి హీరో సూర్య(Hero Surya) కన్నీటితో నివాళి అర్పించారు. విజయకాంత్ చనిపోయిన సమయంలో ఆయన విదేశాల్లో ఉన్నారు.