40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hero Vijay: రాజకీయ పార్టీగా ‘విజయ్‌ మక్కల్‌ ఇయ్యక్కం’.. అధ్యక్షుడిగా విజయ్‌!

ABN, Publish Date - Jan 28 , 2024 | 12:33 PM

తమిళ హీరో విజయ్‌(Tamil hero Vijay) కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటివరకు వున్న విజయ్‌ మక్కల్‌ ఇయ్యక్కం అభిమాన సంఘాన్నే ఆయన రాజకీయ పార్టీగా ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Hero Vijay: రాజకీయ పార్టీగా ‘విజయ్‌ మక్కల్‌ ఇయ్యక్కం’.. అధ్యక్షుడిగా విజయ్‌!

ప్యారీస్‌(చెన్నై): తమిళ హీరో విజయ్‌(Tamil hero Vijay) కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటివరకు వున్న విజయ్‌ మక్కల్‌ ఇయ్యక్కం అభిమాన సంఘాన్నే ఆయన రాజకీయ పార్టీగా ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రాజకీయ పార్టీ గుర్తింపునకు కేంద్ర ఎన్నికల సంఘం కోసం దరఖాస్తు చేయనున్నట్టు సమాచారం. గురువారం స్థానిక పనైయూరులో విజయ్‌ మక్కల్‌ ఇయ్యక్కం ప్రధాన కార్యాలయంలో ముఖ్య నిర్వాహకుల సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో ఇంకా పేరు పెట్టని రాజకీయ పార్టీకి విజయ్‌ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మక్కల్‌ ఇయ్యక్కం పోటీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే విజయ్‌ తన అభిమాన సంఘాన్ని మక్కల్‌ ఇయ్యక్కంగా మార్చి పలు సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్న విషయం తెల్సిందే.

nani1.jpgతమిళ రాజకీయాల్లో విజయ్‌ ప్రవేశిస్తారని, సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతున్నప్పటికీ దీనిపై విజయ్‌ మాత్రం ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు. గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ్‌ మక్కల్‌ ఇయ్యక్కంకు చెందిన నేతలు పలు ప్రాంతాల్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి విజయం సాధించారు. తమిళనాడులో ఉన్న పలు రాజకీయ పార్టీల తరహాలోనే విజయ్‌ ప్రారంభించనున్న పార్టీలో కూడా ‘తమిళనాడు’ అనే పేరు ఉంటుందని, భారత ఎన్నికల సంఘం పార్టీ పేరు రిజిస్ట్రేషన్‌ అయ్యాక పార్లమెంట్‌ ఎన్నికల పనులను విజయ్‌ అధికారికంగా నిర్వాహకులకు అప్పగిస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

Updated Date - Jan 28 , 2024 | 12:33 PM

Advertising
Advertising