ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

High speed train: మైసూరు - చెన్నై మధ్య హైస్పీడ్‌ రైలు

ABN, Publish Date - Jan 18 , 2024 | 01:15 PM

మైసూరు - చెన్నై(Mysore - Chennai) మధ్య హైస్పీడ్‌ రైలు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

- భూసేకరణకు అధికారుల కసరత్తు

- త్వరలోనే డీపీఆర్‌ సిద్ధం

- పూర్తయితే 2.25 గంటలే ప్రయాణం

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): మైసూరు - చెన్నై(Mysore - Chennai) మధ్య హైస్పీడ్‌ రైలు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 435 కిలోమీటర్ల దూరం ఉండే ఈ మార్గంలో కేవలం 2.25 గంటల వ్యవధిలోనే ప్రయాణించే వెసులుబాటు రానుంది. ఆటోమొబైల్‌ హబ్‌ చెన్నై, టెక్‌, స్టార్టప్‌ హబ్‌ బెంగళూరు, సాంస్కృతిక రాజధాని మైసూరు మధ్య ఈ హైస్పీడ్‌ రైలు సంచరించనుంది. కర్ణాటక, తమిళనాడు మధ్య ప్రయాణ వ్యవధిని తగ్గించేలా రైలుమార్గం ఏర్పాటు కానుంది. ఈ బుల్లెట్‌ ట్రెయిన్‌ చెన్నై, పూనమల్లి, అరక్కోణం, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, బంగారపేట, బెంగళూరు, చెన్నపట్టణ, మండ్య, మైసూరుతో కలిపి 9 స్టేషన్లలో ఆగనుంది. నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ జనరల్‌ అలైన్‌మెంట్‌ డ్రైవ్స్‌ సర్వే, ఓవర్‌హెడ్‌, ఓవర్‌ గ్రౌండ్‌, అండర్‌ గ్రౌండ్‌, యుటిలిటీ సబ్‌స్టేషన్‌ పవర్‌సోర్సింగ్‌ విభాగాలను కాంట్రాక్టుకు ఇవ్వనున్నట్టు సమాచారం. హైస్పీడ్‌ రైలు కారిడార్‌ మార్గంలో సర్వే సాగుతున్నట్టు తెలుస్తోంది. హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ అధికారులు, భూముల యజమాలనులతో ప్రాంతాలవారీగా చర్చిస్తున్నట్టు సమాచారం. మరికొన్ని రోజుల్లోనే హైస్పీడ్‌ రైలు ప్రాజెక్టుకు సంబంధించి అంచనా వ్యయంతోపాటు డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ ప్రకటించనున్నారు. మరో రెండు నెలల వ్యవధిలోనే ఈ మార్గానికి సంబంధించి శంకుస్థాపనలు జరిగే అవకాశం ఉంది. బెంగళూరు - చెన్నై ఎక్స్‌ప్రె్‌సవేకు అనుబంధంగానే నిర్మించే అవకాశం ఉంది. ఇది బెంగళూరు శివారులోని హొస్కోటలో ప్రారంభమై చెన్నైలోని పెరంబదూరులో ముగియనుంది.

చెన్నైలో రెండో విమానాశ్రయానికి సమీపంలో రానుంది. ప్రస్తుతం మైసూరు - చెన్నై మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సంచరిస్తోంది. వందేభారత్‌(Vande Bharat) ఆరున్నర గంటలపాటు ప్రయాణం సాగుతుంది. బుల్లెట్‌ రైలు సేవలు అందుబాటులోకి వస్తే కేవలం 2.25 గంటల వ్యవధిలోనే చెన్నై చేరుకోవచ్చు. హైస్పీడ్‌ రైలు గంటకు 350 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణించనుంది. అయితే భద్రతా దృష్ట్యా ఈ వేగాన్ని 250 కిలోమీటర్లకు తగ్గించారు. ప్రతి రైలులో 750 మంది ప్రయాణించే వెసులుబాటు ఉంది. హైస్పీడ్‌ రైల్‌ ఏర్పడితే విమానాల ద్వారా సంచరించే వారి సంఖ్య తగ్గవచ్చని అంచనా వేస్తున్నారు. 2016లో జర్మనీకి చెందిన ఇంజనీర్ల బృందం చెన్నై - మైసూరు హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌పై కార్యాచరణపై అధ్యయనం చేశారు. 2018లో తుది నివేదికను రూపొందించారు. వాటి ప్రకారం 435 కిలోమీటర్ల ట్రాక్‌ నిర్మాణానికి కనీసం లక్ష కోట్లు ఖర్చు కానుందని అంచనా.

Updated Date - Jan 18 , 2024 | 01:15 PM

Advertising
Advertising