ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నిందితులను జైల్లోనే ఉంచేందుకు ఎన్ని చార్జిషీట్లు?

ABN, Publish Date - Mar 21 , 2024 | 06:10 AM

మనీ లాండరింగ్‌ కేసుల్లో నిందితులకు డిఫాల్ట్‌ బెయిల్‌ తిరస్కరించడానికి, వారిని జైల్లోనే ఉంచే ఉద్దేశంతో ఎన్ని అనుబంధ చార్జిషీట్లు దాఖలు చేస్తారంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ లేకుండానే నిందితులను నిరవధికంగా జైల్లోనే ఉంచేందుకు ఈడీ అనుసరిస్తున్న పద్ధతి సరికాదంటూ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌

ఈడీపై సుప్రీంకోర్టు ఆగ్రహం

దర్యాప్తు పూర్తయ్యే వరకు

నిందితుడిని అరెస్టు చేయొద్దు

అదే డిఫాల్ట్‌ బెయిల్‌ ఉద్దేశమన్న కోర్టు

ఝార్ఖండ్‌ మైనింగ్‌ కేసులో హేమంత్‌ సోరెన్‌

పీఏ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ

నిందితుడిని 18 నెలలుగా జైల్లోనే

ఉంచడం ఇబ్బందికి గురిచేసిందని వ్యాఖ్య

చివరకు ఈడీ అభ్యర్థనతో బెయిల్‌ నిరాకరణ

న్యూఢిల్లీ, మార్చి 20: మనీ లాండరింగ్‌ కేసుల్లో నిందితులకు డిఫాల్ట్‌ బెయిల్‌ తిరస్కరించడానికి, వారిని జైల్లోనే ఉంచే ఉద్దేశంతో ఎన్ని అనుబంధ చార్జిషీట్లు దాఖలు చేస్తారంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ)పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ లేకుండానే నిందితులను నిరవధికంగా జైల్లోనే ఉంచేందుకు ఈడీ అనుసరిస్తున్న పద్ధతి సరికాదంటూ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాల ధర్మాసనం ఆక్షేపించింది. ‘డిఫాల్ట్‌ బెయిల్‌ ఉద్దేశమేమిటంటే.. దర్యాప్తు పూర్తయ్యేవరకు మీరు నిందితుడిని అరెస్ట్‌ చేయకూడదు. మీరు (నిందితులను అరెస్టు చేసి కూడా) దర్యాప్తు పూర్తి చేసేవరకు విచారణ చేయొద్దని మాకు చెప్పలేరు. అనుబంధ చార్జిషీట్లు దాఖలు చేస్తూ విచారణ లేకుండా నిందితులను నిరవధికంగా జైల్లో ఉంచలేరు’ అంటూ ఈడీ తరఫు న్యాయవాది అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజుకు తెలిపింది. ఝార్ఖండ్‌ అక్రమ మైనింగ్‌ కేసులోని నిందితుడు ప్రేమ్‌ ప్రకాశ్‌ (మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ సహాయకుడు) దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ‘నిందితుడు 18 నెలలుగా జైల్లోనే ఉన్నాడు. ఇది మమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తోంది. అందుకే మీ (ఈడీ) దృష్టికి తీసుకొస్తున్నాం. నిందితుడిని మీరు అరెస్టు చేసినప్పుడే విచారణ మొదలు కావాలి’ అని స్పష్టంచేసింది. దీనిపై స్పందించిన ఎస్వీ రాజు.. పిటిషనర్‌ సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశముందని వాదించారు. అయితే ఆయన వాదనతో ఏకీభవించని కోర్టు.. ‘అతను (ప్రేమ్‌ ప్రకాశ్‌ ) అలాంటిది ఏదైనా చేస్తే మా వద్దకు రండి’ అంటూ వ్యాఖ్యానించింది. అలాగే ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన ఆప్‌ సీనియర్‌ నేత మనీశ్‌ సిసోడియా జైలు శిక్షను కూడా కోర్టు ప్రస్తావించింది. అయితే దర్యాప్తు పురోగతిని నిర్ధారించేందుకు ఒక నెల పాటు విచారణ జరపాలన్న ఈడీ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ప్రేమ్‌ ప్రకాశ్‌కు మధ్యంతర బెయిల్‌ను నిరాకరిస్తూ విచారణ వాయిదా వేసింది.

Updated Date - Mar 21 , 2024 | 06:10 AM

Advertising
Advertising