ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ayodhya: అయోధ్య రామ్ మందిర్ లో ఎన్ని తలుపులు ఉన్నాయో తెలుసా.. పూర్తి వివరాలివే..

ABN, Publish Date - Jan 04 , 2024 | 12:09 PM

దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఘడియలు వచ్చేందుకు ఇంకా 18 రోజులే మిగిలి ఉంది. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఈ క్రమంలో ఆలయ నిర్మాణ పనులు తుది దశకు వచ్చాయి.

దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఘడియలు వచ్చేందుకు ఇంకా 18 రోజులే మిగిలి ఉంది. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఈ క్రమంలో ఆలయ నిర్మాణ పనులు తుది దశకు వచ్చాయి. గ్రౌండ్ ఫ్లోర్ పనులు ఇప్పటికే పూర్తవగా మిగతా పనులతో ఆలయానికి ఒక రూపం వచ్చింది. ఆలయ నిర్మాణంలో ఉక్కు, ఇనుము ఉపయోగించనప్పటికీ ఈ ఆలయానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ మేరకు శ్రీ రామ జన్మభూమి తీర్థ ట్రస్టు రామ మందిరంలోని కొన్ని ముఖ్య విశేషాలను షేర్ చేసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

సాంప్రదాయ నాగర్ శైలిలో ఉండే ఈ మందిరం పొడవు (తూర్పు-పడమర) 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు కాగా ఎత్తు 161 అడుగులు. మూడంతుస్తులుగా నిర్మితమవుతున్న ఈ మందిరంలోని ఒక్కొక్క అంతస్తు 20 అడుగుల ఎత్తుతో ఉంటుంది. మొత్తం 392 స్తంభాలు, 44 తలుపులు ఉన్నాయి. ప్రధాన గర్భగుడిలో శ్రీరాముని చిన్ననాటి రూపం (శ్రీరామ్ లల్లా విగ్రహం), మొదటి అంతస్తులో శ్రీరామ్ దర్బార్ ఉంటుంది. నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన మండపం, కీర్తన మండపం వంటి ఐదు మండపాలు ఉన్నాయి. ఆలయ స్తంభాలు, గోడలపై దేవతల విగ్రహాలు చెక్కారు. ప్రవేశం తూర్పు సింగ్ ద్వారం నుంచి 32 మెట్లు ఉన్నాయి. దివ్యాంగులు, వృద్ధుల సౌకర్యార్థం ర్యాంప్‌లు, లిఫ్టులు ఏర్పాటు చేశారు.


ఆలయం చుట్టూ 732 మీటర్ల పొడవు, 14 అడుగుల వెడల్పుతో దీర్ఘచతురస్రాకార గోడ నిర్మించారు. నాలుగు మూలల్లో సూర్య దేవ్, దేవి భగవతి, వినాయకుడు, శివుడికి సంబంధించిన నాలుగు ఆలయాలు ఉన్నాయి. ఉత్తరం వైపు అన్నపూర్ణ, దక్షిణం వైపు హనుమంతుని మందిరం ఉన్నాయి. సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రక బావి అయిన సీతాకూప్ ఉంది. శ్రీ రామ జన్మభూమి మందిర్ కాంప్లెక్స్‌లో వాల్మీకి, వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య, నిషాద్ రాజ్, మాతా షబ్రి, దేవీ అహల్య మందిరాలు ఉన్నాయి. కాంప్లెక్స్ నైరుతి భాగంలో కుబేర్, శివాలయం, జటాయుని స్థాపన ఉన్నాయి.

ఆలయ పునాది 14 మీటర్ల మందపాటి రోలర్-కాంపాక్ట్ కాంక్రీట్ (RCC)తో నిర్మితమైంది. తేమ నుంచి రక్షణ కోసం గ్రానైట్ తో 21 అడుగుల ఎత్తైన పునాది నిర్మించారు. మురుగునీటి శుద్ధి కర్మాగారం, నీటి శుద్ధి కర్మాగారం, అగ్ని భద్రత కోసం నీటి సరఫరా, విద్యుత్ కేంద్రం ఉన్నాయి. 25,000 మంది భక్తుల సామర్థ్యంతో యాత్రికుల సౌకర్య కేంద్రం నిర్మితమవుతోంది. ఇందులో భక్తులకు వైద్య సదుపాయాలు, లాకర్ సౌకర్యం అందిస్తారు.

స్నానపు గదులు, వాష్‌రూమ్‌లు, వాష్‌బేసిన్, ఓపెన్ ట్యాప్‌లు వంటి వాటితో ప్రత్యేక బ్లాక్ ఉంది. ఆలయాన్ని పూర్తిగా భారత సాంప్రదాయ, స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి నిర్మిస్తున్నారు. 70 ఎకరాల విస్తీర్ణంలో 70% పచ్చగా ఉండడంతో పర్యావరణ-నీటి సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ అయోధ్య రామ మందిర్ ను నిర్మిస్తున్నారు.

Updated Date - Jan 04 , 2024 | 12:11 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising