ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘హంటర్‌ కిల్లర్స్‌’ వచ్చేస్తున్నాయ్‌!

ABN, Publish Date - Oct 16 , 2024 | 01:42 AM

చైనా, పాకిస్థాన్‌ల వెంబడి సరిహద్దులు, హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో సైనిక శక్తిని పెంచుకునే దిశగా భారత్‌ మరో ముందడుగు వేసింది. దీనికోసం ఆకాశంలో నిరంతరం నిఘాపెట్టే ‘హంటర్‌ కిల్లర్‌’ డ్రోన్లను రంగంలోకి దించనుంది. ఈ మేరకు అత్యాధునిక ఎంక్యూ-9బీ సాయుధ ప్రిడేటర్‌ డ్రోన్ల కొనుగోలు చేసేందుకు అమెరికాతో కీలక ఒప్పందం చేసుకుంది. అమెరికన్‌ డిఫెన్స్‌ మేజ

అమెరికా నుంచి 31 ప్రిడేటర్‌ డ్రోన్ల కొనుగోలుకు డీల్‌

చైనా సరిహద్దుల్లో మోహరించనున్న భారత్‌

న్యూఢిల్లీ, అక్టోబరు 15: చైనా, పాకిస్థాన్‌ల వెంబడి సరిహద్దులు, హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో సైనిక శక్తిని పెంచుకునే దిశగా భారత్‌ మరో ముందడుగు వేసింది. దీనికోసం ఆకాశంలో నిరంతరం నిఘాపెట్టే ‘హంటర్‌ కిల్లర్‌’ డ్రోన్లను రంగంలోకి దించనుంది. ఈ మేరకు అత్యాధునిక ఎంక్యూ-9బీ సాయుధ ప్రిడేటర్‌ డ్రోన్ల కొనుగోలు చేసేందుకు అమెరికాతో కీలక ఒప్పందం చేసుకుంది. అమెరికన్‌ డిఫెన్స్‌ మేజర్‌ జనరల్‌ అటామిక్స్‌ నుంచి దాదాపు 33,615 కోట్ల వ్యయంతో 31 ప్రిడేటర్‌ డ్రోన్ల కొనుగోలుకు ఈ ఒప్పందం కుదిరింది. ఢిల్లీలో భారత రక్షణశాఖ ఉన్నతాధికారులు మంగళవారం ఈ డీల్‌పై సంతకాలు చేశారు. అమెరికా నుంచి ఎంక్యూ-9బీ సాయుధ డ్రోన్ల కొనుగోలుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్‌ (సీసీఎస్‌) గతవారం ఆమోదం తెలిపింది. దీంతో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు కొన్ని వారాల ముందే ఈ డీల్‌ ఖరారైంది. ఈ 31 డ్రోన్లలో భారత నౌవికాదళానికి 15, వాయుసేనకు 8, సైన్యానికి 8 చొప్పున కేటాయిస్తారు. ఎంక్యూ-9బీ ‘హంటర్‌ కిల్లర్‌’ డ్రోన్‌ అనేది ఎంక్యూ-9 ‘రీపర్‌’ డ్రోన్‌కు అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌. 2022 జూలైలో అఫ్ఘానిస్థాన్‌ రాజధాని కాబూల్‌ నడిబొడ్డున అల్‌-ఖైదా నాయకుడు అల్‌-జవహరిని మట్టుబెట్టిన హెల్‌ఫైర్‌ క్షిపణిని ప్రయోగించింది ఎంక్యూ-9 డ్రోన్‌ నుంచే. దాన్ని అప్‌గ్రేడ్‌ చేసి ఎంక్యూ-9బీ డ్రోన్లను తీసుకొచ్చారు. ఇవి ఎక్కువ ఎత్తులోనూ ఏకబిగిన 35 గంటలకుపైగా గాల్లో ఎగరగలవు. నాలుగు హెల్‌ఫైర్‌ క్షిపణులు, 450 కిలోల వరకు బాంబులను మోసుకెళ్లగలవు.

Updated Date - Oct 16 , 2024 | 01:42 AM