ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

IAF Helicopter: ఐఏఎఫ్ హెలికాప్టర్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్

ABN, Publish Date - Nov 06 , 2024 | 08:38 PM

రొటీన్ శిక్షణా విన్యాసాల్లో భాగంగా హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తిందని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఆ వెంటనే సురక్షితంగా హెలికాప్టర్ ల్యాండింగ్ కావడంతో వింగ్ కమాండర్ పాల్ సింగ్ సహా అందులోని వారంతా సురక్షితంగా బయటపడ్డారని చెప్పారు.

జైపూర్: భారత వైమానిక దళ (IAF) హెలికాప్టర్ ఒకటి బుధవారంనాడు రాజస్థాన్‌లోని నాగౌర్‌లో అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. జోథ్‌పూర్ నుంచి జైపూర్ వెళ్తుండగా సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ చాకచక్యంగా వ్యవహరించి జాస్‌నగర్‌లోని పొలాల్లో హెలికాప్టర్‌ను ల్యాండ్ చేయడంతో ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు తెలిపారు.

కమలా హారిస్ ఓటమిని జీర్ణించుకోలేకున్న పూర్వీకుల గ్రామం


మేరతా డీఎస్‌పీ రామకరణ్ మలిండ ఆ వివరాలను వెల్లడిస్తూ, రెండు ఐఏఎఫ్‌ హెలికాప్టర్లు జోధ్‌పూర్ నుంచి జైపూర్ వెళ్తుండగా, ఒక హెలికాప్టర్‌లో సాకేంతిక సమస్య తలెత్తడం పైలెట్ గుర్తించాడు. దీంతో అత్యవసరంగా హెలికాప్టర్ ల్యాండింగ్ చేశాడు. వాయుసేనకు చెందిన నిపుణుల బృందం ఘటనా స్థలికి చేరుకుని సాంకేతిక లోపాన్ని సరిచేసిన అనంతరం హెలికాప్టర్ తిరిగి బయలుదేరిందని చెప్పారు.


రొటీన్ శిక్షణా విన్యాసాల్లో భాగంగా హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తిందని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. ఆ వెంటనే సురక్షితంగా హెలికాప్టర్ ల్యాండింగ్ కావడంతో వింగ్ కమాండర్ పాల్ సింగ్ సహా అందులోని వారంతా సురక్షితంగా బయటపడ్డారని చెప్పారు. ఐఏఎఫ్ హెలికాప్టర్ పొలాల్లో దిగడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు.


ఇవి కూాడా చదవండి

PM Modi: నా బెస్ట్ ఫ్రెండ్‌కు విషెస్..మోదీ ట్వీట్

Chief Minister: సీఎం సిద్దరామయ్య ఆసక్తికర కామెంట్స్.. 40 ఏళ్లకిందటే మంత్రిగా పనిచేశా

For More National and telugu News

Updated Date - Nov 06 , 2024 | 08:38 PM