మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ICMR : అదేం అధ్యయనం?

ABN, Publish Date - May 21 , 2024 | 04:14 AM

భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ దుష్ప్రభావాలపై బనారస్‌ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యు) అధ్యయనం సరైన పద్ధతిలో జరగలేదని ఐసీఎంఆర్‌ స్పష్టం చేసింది. ఈ అధ్యయనం కోసం అనుసరించిన మెథడాలజీని తప్పుబట్టింది.

ICMR : అదేం అధ్యయనం?

  • కొవాగ్జిన్‌ దుష్ప్రభావాలపై బీహెచ్‌యు స్టడీని

  • తప్పుపట్టిన భారత వైద్య పరిశోధన మండలి

న్యూఢిల్లీ, మే 20: భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ దుష్ప్రభావాలపై బనారస్‌ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యు) అధ్యయనం సరైన పద్ధతిలో జరగలేదని ఐసీఎంఆర్‌ స్పష్టం చేసింది. ఈ అధ్యయనం కోసం అనుసరించిన మెథడాలజీని తప్పుబట్టింది. వర్సిటీ తన నివేదికలో.. తప్పుదోవ పట్టించేలా తమ పేరును ఉటంకించిందని, కాబట్టి, వెంటనే అందులోంచి పేరును తొలగించడమే కాక, పేరును తప్పుగా ఉటంకించినట్టుగా పేర్కొంటూ సవరణ వేయాలని నివేదికను ప్రచురించిన డ్రగ్‌ సేఫ్టీ జర్నల్‌ సంపాదకుడు నితిన్‌ జోషికి ఐసీఎంఆర్‌ డీజీ రాజీవ్‌ బహ్ల్‌ లేఖ రాశారు. లేకపోతే న్యాయపరమైన, పాలనాపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.

వ్యాక్సిన్‌ దుష్ప్రభావాలపై అధ్యయనం చేయాలంటే.. టీకా వేయించుకున్న, వేయించుకోని గ్రూపులు రెండింటినీ పోల్చిచూడాలని, కానీ అలా చేయలేదని, కాబట్టి టీకా వల్ల కలిగిన దుష్ప్రభావాలుగా అధ్యయన నివేదికలో పేర్కొన్న సమస్యలకు, కొవిడ్‌-19 టీకాకు సంబంధం ఉందని చెప్పలేమని పేర్కొన్నారు.1024 మందిని వ్యాక్సిన్‌ వేయించుకున్న ఏడాది తర్వాత ఫోన్‌ ద్వారా సంప్రదించిన బీహెచ్‌యూ... ‘12 నెలల వ్యవధిలో ఏవైనా ఆరోగ్య సమస్యలు వచ్చాయా’ అని అడిగింది. వారు చెప్పిన వివరాలను నమోదు చేసుకుంది తప్ప.. ఎలాంటి వైద్య రికార్డులనూ పరిశీలించి, ధ్రువీకరించుకోలేదు.

Updated Date - May 21 , 2024 | 04:14 AM

Advertising
Advertising