మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

New York: గాజాలో శిథిలాలు.. తొలగింపునకు 14 ఏళ్లు

ABN, Publish Date - Apr 28 , 2024 | 04:03 AM

గాజాపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో.. కూలిన భవనాల శకలాలు, పేలని ఆయుధాలను తొలగించడానికి 14 ఏళ్ల సమయం పట్టవచ్చని ఐక్య రాజ్య సమితి(ఐరాస) అంచనా వేసింది.

New York: గాజాలో శిథిలాలు.. తొలగింపునకు 14 ఏళ్లు

  • ఐక్య రాజ్య సమితి అంచనా..34 వేలకు మరణాలు

సెంట్రల్‌ గాజా/న్యూయార్క్‌, ఏప్రిల్‌ 27: గాజాపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో.. కూలిన భవనాల శకలాలు, పేలని ఆయుధాలను తొలగించడానికి 14 ఏళ్ల సమయం పట్టవచ్చని ఐక్య రాజ్య సమితి(ఐరాస) అంచనా వేసింది. అది కూడా రోజుకు 100 ట్రక్కులను ఉపయోగిస్తే కానీ, పూర్తిస్థాయిలో శిథిలాల తొలగింపు సాధ్యం కాదని పేర్కొంది. శిథిలాలను, పేలకుండా మిగిలిపోయిన రాకెట్లు, బాంబులను పూర్తిస్థాయిలో తొలగించాకే గాజా తిరిగి సురక్షిత ప్రాంతంగా మారుతుందని అభిప్రాయపడింది.


ఇదే చివరి అవకాశం: ఇజ్రాయెల్‌

గాజాలోని రఫా(ప్రస్తుతం నిరాశ్రయులు ఉన్న ప్రాంతం)లో కాల్పుల విరమణకు మరో అవకాశం ఇవ్వబోమని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సె్‌స(ఐడీఎఫ్‌) స్పష్టం చేసింది. ఇదే చివరి అవకాశమని, హమాస్‌ ముందు పెట్టిన ప్రతిపాదనలపై స్పందించాలని పేర్కొంది. కాగా.. ఈ ప్రతిపాదనపై హమాస్‌ వర్గాలు శనివారం స్పందించాయి. ఇజ్రాయెల్‌ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు ‘అల్‌హుర్రా’ వార్తా సంస్థకు తెలిపాయి.


శుక్ర, శనివారాల్లో ఐరాస డీమైనింగ్‌ నిపుణులు గాజాలో పర్యటించారు. ప్రాథమిక అంచనా ప్రకారం ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో గాజాలో సుమారు 3.7 కోట్ల టన్నుల శిథిలాలు మిగిలిపోయినట్లు యునైటెడ్‌ నేషన్స్‌ మైన్‌ యాక్షన్‌ సర్వీ్‌స(యూఎన్‌ఎంఏఎ్‌స) సీనియర్‌ అధికారి పెర్‌ లుధామర్‌ తెలిపారు. ‘‘గాజాలో ప్రతి చదరపు కిలోమీటరుకు 200 కిలోల మేర పేలని బాంబులు ఉన్నాయి. ఇజ్రాయెల్‌ ప్రయోగించిన మందుగుండులో కనీసం 10ు పేలకుండా మిగిలిపోయాయి’’ అని ఆయన వివరించారు. కాగా.. ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం కారణంగా పాలస్తీనీ మృతుల సంఖ్య శనివారానికి 34,388కి చేరుకుందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Updated Date - Apr 28 , 2024 | 06:48 AM

Advertising
Advertising