Delhi: యాపిల్ పరికరాల ఉత్పత్తి కేంద్రంగా భారత్.. రూ.14 బిలయన్ డాలర్ల మార్కెట్‌కు చేరువ
ABN, Publish Date - Apr 10 , 2024 | 03:50 PM
భారత్‌లో యాపిల్ ఐఫోన్ల(Apple Iphones) ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగినట్లు బ్లూమ్ బర్గ్(Bloomberg) నివేదిక వెల్లడించింది. బుధవారం వెలువడిన ఈ నివేదికలోని వివరాల ప్రకారం.. 2023లో భారత్‌లో యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ల ఉత్పత్తి విపరీతంగా పెరిగింది.
ఢిల్లీ: భారత్‌లో యాపిల్ ఐఫోన్ల(Apple iPhones) ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగినట్లు బ్లూమ్ బర్గ్(Bloomberg) నివేదిక వెల్లడించింది. బుధవారం వెలువడిన ఈ నివేదికలోని వివరాల ప్రకారం.. 2023లో భారత్‌లో యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ల ఉత్పత్తి విపరీతంగా పెరిగింది. ఆ ఏడాది సుమారు 14 బిలియన్ల డాలర్ల ఖరీదైన ఐఫోన్లను భారత్‌లో తయారు చేశారు. ఇది గతంతో పోల్చితే రెండింతలని అధికారులు చెబుతున్నారు.
అయితే చైనాపై యాపిల్ కంపెనీ దృష్టి సారించకపోవడం వల్ల భారత్ లో యాపిల్ ఉత్పత్తి జోరు పెరిగినట్లు తెలుస్తోంది. మన దేశంలో సుమారు 14 శాతం యాపిల్ ఉత్పత్తులు జరుగుతున్నట్లు బ్లూమ్ బర్గ్ వెల్లడించింది. అంటే ప్రపంచవ్యాప్తంగా 7 యాపిల్ పరికరాలు ఉత్పత్తి అయితే అందులో ఒకటి భారత్‌లోనే తయారవుతుందన్నమాట. భారత్‌లో ఉత్పత్తి పెంచడం వల్ల ఇన్నాళ్లూ చైనాపై ఆధారపడ్డ యాపిల్ సంస్థ ఇప్పుడు ఆ దేశంపై తన అవసరాన్ని తగ్గించుకుంటోంది.
ప్రస్తుతం అమెరికా, చైనా మధ్య ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనూ ఉత్పత్తి తగ్గినట్లు తెలుస్తోంది. చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ తయారీ కేంద్రంగా ఉన్నప్పటికీ బీజింగ్, వాషింగ్టన్ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య యాపిల్ తన ఉత్పత్తిని వేరే దేశాలకు విస్తరించాలని చూస్తోంది.
Survey on Womens: మేం ఆ ఉద్యోగాలు చేయం.. తేల్చిచెబుతున్న మహిళలు
ఇందులో భాగంగా తమిళనాడు రాష్ట్రం చెన్నైకి సమీపంలో ఉన్న ఏకైక ఐఫోన్ తయారీ కేంద్రం నియంత్రణను టాటా గ్రూప్‌కు అప్పగించేందుకు పెగాట్రాన్ చర్చలు జరుపుతోందని రాయిటర్స్ సోమవారం నివేదించింది. యాపిల్ సంస్థ 2017 నుంచి భారత్‌లో ఐఫోన్లను తయారీ చేస్తోంది. కొన్నేళ్ల క్రితం భారత్ లో యాపిల్ పరికరాల ఉత్పత్తి అంటే గగనంగా ఉండేది. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Apr 10 , 2024 | 03:50 PM