Monkeypox: చాపకింద నీరులా మంకీపాక్స్.. భారత్‌లో మూడో కేసు నమోదు
ABN, Publish Date - Sep 23 , 2024 | 06:31 PM
ప్రపంచదేశాల్లో కోరలు చాస్తున్న మంకీపాక్స్(Monkeypox) భారత్‌లోనూ విజృంభిస్తోంది. దేశంలో సోమవారం మూడో మంకీపాక్స్ కేసు నమోదు అయింది. దుబాయ్ నుంచి కేరళకు వచ్చిన వ్యక్తికి ఎంపాక్స్ లక్షణాలున్నట్లు అధికారులు గుర్తించారు.
ఢిల్లీ: ప్రపంచదేశాల్లో కోరలు చాస్తున్న మంకీపాక్స్(Monkeypox) భారత్‌లోనూ విజృంభిస్తోంది. దేశంలో సోమవారం మూడో మంకీపాక్స్ కేసు నమోదు అయింది. దుబాయ్ నుంచి కేరళకు వచ్చిన వ్యక్తికి ఎంపాక్స్ లక్షణాలున్నట్లు అధికారులు గుర్తించారు. అనుమానంతో టెస్టులు చేయగా పాజిటివ్ వచ్చింది. అతనికి మంకీపాక్స్ గ్రేడ్-1 బి వైరస్ నిర్ధారణ అయింది. ఇప్పటికే పలు దేశాలను కలవరపెడుతున్న మంకీపాక్స్ (ఎంపాక్స్) కేసుల సంఖ్య భారత్‌లో క్రమంగా పెరుగుతోంది. కేసులు పెరుగుతున్న దృష్ట్యా కేంద్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చే వారిలో ఎవరికైనా మంకీపాక్స్ లక్షణాలు కనబడితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని కోరింది. భారత్‌లో సెప్టెంబర్ 9న తొలి కేసు, సెప్టెంబర్ 18న రెండు, సెప్టెంబర్ 23న మూడో కేసు నమోదైంది.
మంకీపాక్స్ లక్షణాలు ఏంటి?
మంకీపాక్స్ ఇన్‌ఫెక్షన్ సాధారణంగా 2-4 వారాల పాటు ఉంటుందని, సపోర్టివ్ మేనేజ్‌మెంట్‌తో రోగులు కోలుకుంటున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమావేశంలో వెల్లడైంది. అలైంగిక సంపర్కం, గాయపడిన వ్యక్తితో ప్రత్యక్ష సంబంధం లేదా సోకిన వ్యక్తి దుస్తులు లేదా బెడ్‌షీట్‌లను ఉపయోగించడం ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది.
వాపు శోషరస కణుపులు
జ్వరం
చలిగా అనిపించడం
కండరాల నొప్పి
తలనొప్పి
అలసట
చికిత్స ఎలా ?
Mpox చాలా సందర్భాలలో దానంతటదే తగ్గుతుంది. కానీ కొందరిలో ఇది తీవ్రంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఈ వ్యాధికి వ్యాక్సిన్ లేదా సూచించిన మందులు లేవు. రోగికి అతని లక్షణాల ఆధారంగా మాత్రమే చికిత్స చేస్తారు. వైద్యులు యాంటీవైరల్ మందులు ఇవ్వడం ద్వారా వ్యాధిని నియంత్రిస్తారు.
For Latest News and National News click here
Updated Date - Sep 23 , 2024 | 06:31 PM