ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

India Aid: లెబనాన్‌కు భారత్‌ మానవతా సాయం

ABN, Publish Date - Oct 18 , 2024 | 08:16 PM

సంక్షుభిత పరిస్థితుల్లో అల్లాడుతున్న ప్రజలను ఆదుకునేందుకు పెద్దఎత్తున ఔషధాలను భారత్ పంపుతోంది. ఇందులో భాగంగా 33 టన్నుల మానవతా సరఫరాలను పంపుతున్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు.

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య భీకర దాడులతో మానవతాసాయం కోసం అల్లాడుతున్న లెబనాన్‌ ప్రజలకు భారత్ ఆపన్న హస్తం అందించింది. మానవతా సాయాన్ని అందించాలని నిర్ణయించింది. సంక్షుభిత పరిస్థితుల్లో అల్లాడుతున్న ప్రజలను ఆదుకునేందుకు పెద్దఎత్తున ఔషధాలను పంపుతోంది. ఇందులో భాగంగా 33 టన్నుల మానవతా సరఫరాలను పంపుతున్నట్టు కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు.

Ujjain Temple Row: వివాదంలో చిక్కుకున్న సీఎం కుమారుడు


తొలి విడతగా 11 టన్నుల వైద్య సామగ్రిని శుక్రవారంనాడు పంపినట్టు జైశ్వాల్ వెల్లడించారు. ఇందులో కార్డియోవాస్కులర్ ఔషధాలు, నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందులు, యాంటీ బయాటిక్స్, అనస్థీసియా మందులను పంపుతున్నట్టు తెలిపారు.


అడగక ముందే ఆదుకుంటున్న ఆప్తుడు

సంక్షుభిత సమయంలో భారత్ పెద్దఎత్తున లెబనాన్‌కు మానవతా సాయాన్ని అందిస్తుండటంపై భారత్‌లో లెబనాన్ రాయబారి రబియో నరషీ కృతజ్ఞతలు తెలిపారు. లెబనాన్‌కు దాడి మొదలైనప్పటి నుంచి ప్రపంచ దేశాల నుంచి అందుతున్న మానవతాసాయానికి రుణపడి ఉంటామని అన్నారు. మానవతా సాయంలో భారత్ అన్ని దేశాల కంటే ముందుందని ప్రశంసించారు. ఇండియా తమకు మంచి మిత్రదేశమని, 70,80 ఏళ్ల క్రితం ఇరుదేశాలకు స్వాతంత్రంయ వచ్చినప్పటి నుంచి అద్భుతమైన సంబంధాలు ఇరుదేశాల మధ్య ఉన్నాయని అన్నారు. తాము కోరకముందే భారత్ ఆదుకుంటూ తమకు అండగా నిలుస్తోందన్నారు.


Read More National News and Latest Telugu News

ఇది కూడా చదవండి..

Gurpatwant Singh Pannun: ఖలిస్థానీ ఉగ్రవాది హత్యకు కుట్రలో బిగ్ ట్విస్ట్.. భారత 'రా' అధికారిపై అమెరికా అభియోగాలు..

Updated Date - Oct 18 , 2024 | 08:29 PM