ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

India-China: సరిహద్దులో స్వీట్లు పంచుకున్న భారత్-చైనా సైనికులు.. ఎందుకంటే

ABN, Publish Date - Oct 31 , 2024 | 09:27 PM

గాల్వాన్ లోయ ఘర్షణ తర్వాత నాలుగేళ్ల పాటు సరిహద్దులో కొనసాగిన ప్రతిష్ఠంభనకు ఇటీవలే ముగింపుపడిన విషయం తెలిసిందే. బలగాల ఉపసంహరణకు భారత్, చైనా అంగీకారం కుదుర్చుకున్నాయి.

India China

న్యూఢిల్లీ: గాల్వాన్ లోయ ఘర్షణ తర్వాత నాలుగేళ్ల పాటు సరిహద్దులో కొనసాగిన ప్రతిష్ఠంభనకు ఇటీవలే ముగింపుపడిన విషయం తెలిసిందే. బలగాల ఉపసంహరణకు భారత్, చైనా అంగీకారం కుదుర్చుకున్నాయి. ఒప్పందంలో భాగంగా ఎల్ఏసీ వెంబడి ఉన్న డెప్సాంగ్, డెమ్‌చోక్ ప్రాంతాలలో బలగాల ఉపసంహరణ పూర్తయింది. దీంతో ఇవాళ భారత్ - చైనా సరిహద్దులోని ఐదు ప్రాంతాల ఇరు దేశాల సైనికులు పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. లడఖ్‌లోని రెండు ప్రాంతాలలో కూడా స్వీట్లు పరస్పరం మార్చుకున్నారు. గత వారం కుదిరిన ఒప్పందానికి అనుగుణంగా దెప్సాంగ్, డెమ్‌చోక్ ప్రాంతాల్లో సైనిక ఉపసంహరణ పూర్తయిన మరుసటి రోజు ఈ పరిణామం చోటుచేసుకుంది.


కాగా ఇవాళ స్వీట్లు మార్చుకున్న సరిహద్దు ప్రాంతాలలో డెప్సాంగ్, డెమ్‌చోక్‌తో పాటు చుషుల్ మాల్డో, దౌలత్ బేగ్ ఓల్డి, అరుణాచల్ ప్రదేశ్‌లోని బంచా (కిబుటు సమీపంలో), బుమ్లా, సిక్కింలోని నాథులా ఉన్నాయి. కాగా పెట్రోలింగ్ ఒప్పందంలో డెప్సాంగ్, డెమ్‌చోక్ ప్రాంతాలలో ఇరు సేనలు ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక శిబిరాలను తొలగించాయి. మౌలిక సదుపాయాలను సైతం తొలగించాయి. దీంతో ఏప్రిల్ 2020కి ముందు ఉన్న స్థానాలకు దళాలు వెనక్కి మళ్లాయి.

Updated Date - Oct 31 , 2024 | 09:27 PM