ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Indian Railways: కవచ్ అమలవుతున్న రాష్ట్రాల జాబితా ఇదే..!!

ABN, Publish Date - Jan 08 , 2024 | 03:34 PM

Indian Railways: రైళ్లలో ప్రయాణికుల భద్రత కోసం ఇండియన్ రైల్వేస్ ‘కవచ్’ను అందుబాటులోకి తెచ్చింది. కవచ్ అనేది రైల్వే రక్షణ వ్యవస్థ. ప్రమాదాల నుంచి రైళ్లను ఈ వ్యవస్థ కాపాడుతుంది. ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ప్రయాణించకుండా ఆపగలుగుతుంది. అయితే కవచ్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అమలు కావడం లేదు. కేవలం దక్షిణ మధ్య రైల్వేలో మాత్రమే యాంటీ కొలిజన్ సిస్టమ్ (కవచ్) అమలవుతోంది.

రైళ్లలో ప్రయాణికుల భద్రత కోసం ఇండియన్ రైల్వేస్ ‘కవచ్’ను అందుబాటులోకి తెచ్చింది. కవచ్ అనేది రైల్వే రక్షణ వ్యవస్థ. ప్రమాదాల నుంచి రైళ్లను ఈ వ్యవస్థ కాపాడుతుంది. ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ప్రయాణించకుండా ఆపగలుగుతుంది. అయితే కవచ్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో అమలు కావడం లేదు. కేవలం దక్షిణ మధ్య రైల్వేలో మాత్రమే యాంటీ కొలిజన్ సిస్టమ్ (కవచ్) అమలవుతోంది. ఈ విషయాన్ని స్వయంగా రైల్వే శాఖ వెల్లడించింది. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కవచ్ అమలవుతోందని ఓ నెటిజన్ ఆర్‌టీఐలో అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చింది.

కాగా ప్రస్తుతం నార్తర్న్, నార్త్ సెంట్రల్, ఈస్టర్న్, ఈస్ట్ సెంట్రల్, వెస్టర్న్, వెస్ట్ సెంట్రల్ పరిధిలో కవచ్ పనులు జరుగుతున్నాయని రైల్వేశాఖ వెల్లడించింది. కవచ్ కోసం 2014-2023 వరకు రూ.540 .02 కోట్లు ఖర్చు చేసినట్లు వివరణ ఇచ్చింది. 2012లో ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ (TCAS) పేరుతో కవచ్ వ్యవస్థ ప్రారంభమైంది. అయితే 2017 నుంచి దీన్ని తొలిసారి అమలులోకి తీసుకువచ్చారు. లోకోమోటివ్‌లు, ట్రాక్‌లు, రైల్వే సిగ్నలింగ్ సిస్టమ్, ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ప్రతి స్టేషన్‌లలో అమర్చబడిన ఎలక్ట్రానిక్ పరికరాలు, రేడియో ఫ్రీక్వెన్సీ గుర్తింపు పరికరాల ద్వారా ఇది పని చేస్తుంది. 4G LTE ఆధారిత సిస్టంతో అభివృద్ధి చేసిన ఈ సాంకేతికత సిస్టమ్.. అల్ట్రా హై రేడియో ఫ్రీక్వెన్సీల ద్వారా కమ్యూనికేట్ చేస్తుంది.

Updated Date - Jan 08 , 2024 | 03:34 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising