ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ISRO: చంద్రయాన్‌-3కి రేపటితో ఏడాది

ABN, Publish Date - Aug 22 , 2024 | 05:39 AM

ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా కాలుపెట్టి ఈ నెల 23వ తేదీకి ఏడాది పూర్తవుతుంది.

  • 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం

  • ఘనంగా నిర్వహణకు భారత్‌ ఏర్పాట్లు

న్యూఢిల్లీ, ఆగస్టు 21: ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-3 చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా కాలుపెట్టి ఈ నెల 23వ తేదీకి ఏడాది పూర్తవుతుంది. ఈ విజయంతో చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసిన తొలి దేశంగా భారత్‌ చరిత్ర సృష్టించింది. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు తొలి రాష్ట్రీయ విజ్ఞాన్‌ పురస్కారం కూడా లభించింది.


గతేడాది ఆగస్టు 23న చంద్రుడిపై విక్రమ్‌ ల్యాండర్‌ విజయవంతంగా కాలుమోపిన సందర్భంగా ఈ ఏడాది అదే రోజున తొలిసారిగా జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్టు కేంద్ర ప్రకటించింది. 2019లో ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌-2 చివరి నిమిషంలో చంద్రుడిపై కూలిపోయింది. ఈ వైఫల్యం నుంచి పాఠాలు నేర్చుకున్న ఇస్రో.. మరో నాలుగేళ్లలోనే చంద్రయాన్‌-3తో అద్భుత విజయాన్ని అందుకొంది.


చంద్రయాన్‌-3లోని విక్రమ్‌ ల్యాండర్‌ సురక్షితంగా చంద్రుడిపై కాలుపెట్టింది. అలా ల్యాండర్‌ దిగిన ప్రాంతానికి ఇస్రో శివ శక్తి పాయింట్‌గా నామకరణం చేసింది. శివ శక్తి పాయింట్‌ నుంచి శాంపిల్స్‌ను సేకరించి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తామని, బహుశా చంద్రయాన్‌-4లో దీనికోసం ప్రయత్నిస్తామని ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ చెప్పారు. అలాగే భారత్‌, జపాన్‌ చేపట్టే సంయుక్త మిషన్‌ ద్వారా చంద్రుడిపైకి ప్రజ్ఞాన్‌ కంటే పెద్ద రోవర్‌ను దింపేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వెల్లడించారు.


2040 నాటికి భారత వ్యోమగామని చంద్రుడిపైకి పంపే లక్ష్యంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. కాగా, నాసా-ఇస్రో సంయుక్త మిషన్‌లో భాగంగా భారత్‌కు చెందిన వ్యోమగామి వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎ్‌సఎస్‌) వెళ్తారని కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్‌ తెలిపారు. యాక్సియోమ్‌ స్పేస్‌ ఏఎక్స్‌-4 మిషన్‌ కోసం ఎంపిక చేసిన ఇద్దరు భారత వ్యోమగాములు గ్రూప్‌ కెప్టెన్లు శుభాన్షు శుక్లా, ప్రశాంత్‌ బాలకృష్ణన్‌ నాయర్‌ అమెరికాలో శిక్షణ పొందుతున్నారు.

Updated Date - Aug 22 , 2024 | 05:39 AM

Advertising
Advertising
<