ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jairam Ramesh: మోదీ మణిపూర్‌లో ఎందుకు పర్యటించలేదని ప్రజలు అడుగుతున్నారు..ఏం చెబుతారు?

ABN, Publish Date - Jan 15 , 2024 | 03:24 PM

భారత ప్రధాని మోదీ మణిపూర్‌లో ఎందుకు పర్యటించడంలేదని ప్రజలు అడుగుతున్నారని కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ వెల్లడించారు. మణిపూర్‌కు వచ్చి ప్రధాని ప్రజలను కలవాలని అందరూ కోరుతున్నారని చెప్పారు. అసలు బీజేపీ ప్రభుత్వం మణిపూర్ ప్రజలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.

మణిపూర్‌(Manipur)లో నిన్న ప్రారంభమైన 'భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర'లో రాహుల్‌ గాంధీతో కలిసి కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌(Jairam Ramesh) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రమేష్ ప్రధాని మోదీ మణిపూర్‌లో ఎందుకు పర్యటించడం లేదని ప్రజలు అడుగుతున్నారని వెల్లడించారు. మణిపూర్‌కు వచ్చి ప్రధాని ప్రజలను కలవాలని అందరూ కోరుతున్నారని చెప్పారు. అసలు బీజేపీ ప్రభుత్వం మణిపూర్ ప్రజలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. అంతేకాదు మణిపూర్‌లో గత 8 నెలల నుంచి పాలన సరిగా లేదని ఆరోపించారు. ఇద్దరు మంత్రులు ఆన్‌లైన్‌లో పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Yashasvi Jaiswal: విరాట్ భయ్యాతో కలిసి ఆడటం ఎంతో గొప్పగా అనిపించింది

ఇలాంటి క్రమంలో ప్రతి ఒక్కరూ ప్రజా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని జైరాం రమేష్ తెలిపారు. ఈ క్రమంలోనే మణిపూర్‌లో ప్రజల బాధలను రాహుల్ గాంధీ(Rahul gandhi) విన్నారని జైరాం రమేష్ అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర రెండో రోజు సోమవారం తెల్లవారుజామున మణిపూర్‌లోని ఇంఫాల్ వెస్ట్ నుంచి తిరిగి ప్రారంభమైంది. హింసాత్మకమైన రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ బలమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని రాహుల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఇక్కడకు ఎంత మంది తరలివచ్చారో మీరు చూడొచ్చని రాహుల్‌ అన్నారు. స్కూలు, కాలేజీలకు వెళ్లలేని వారు సహా అనేక మంది ఉన్నారని తెలిపారు. యాత్ర ప్రారంభానికి ముందు రాష్ట్రంలో జరిగిన హింసాకాండలో మృతి చెందిన వ్యక్తులకు పార్టీ నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. ఈ యాత్ర 110 జిల్లాల గుండా యాత్ర 67 రోజుల పాటు 6,700 కిలోమీటర్లకు పైగా కొనసాగనుంది.

Updated Date - Jan 15 , 2024 | 03:28 PM

Advertising
Advertising