ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శంకర్‌దాదాలు.. ఉత్తుత్తి దవాఖానా తెరిచారు

ABN, Publish Date - Nov 20 , 2024 | 04:45 AM

‘జనసేవా మల్టీస్పెషాల్టీ హాస్పిటల్‌’ ఈ పేరుతో గుజరాత్‌లోని సూరత్‌లో భారీ ఆస్పత్రి వెలిసింది. విశిష్ట అతిథులుగా పోలీసు అధికారులొచ్చి ఆదివారం ప్రారంభించారు.

ప్రారంభోత్సవం జరిగిన మర్నాడే మూసివేత.. సూరత్‌లో ఘటన

సూరత్‌, నవంబరు 19: ‘జనసేవా మల్టీస్పెషాల్టీ హాస్పిటల్‌’ ఈ పేరుతో గుజరాత్‌లోని సూరత్‌లో భారీ ఆస్పత్రి వెలిసింది. విశిష్ట అతిథులుగా పోలీసు అధికారులొచ్చి ఆదివారం ప్రారంభించారు. అయితే మర్నాడే అంటే సోమవారమే ఆ ఆస్పత్రిని ప్రభుత్వ అధికారులు మూసేశారు. కారణం.. దాన్ని స్థాపించిన వైద్యులంతా నకిలీ వైద్యులేనని తేలింది. ఈ ఆస్పత్రిని ఐదుగురు వైద్యులు స్థాపించగా.. అందులో ఇద్దరివి పూర్తి నకిలీ డిగ్రీలని.. మిగతా ముగ్గురి విద్యార్హతల పత్రాలపైనా సందేహాలున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఆస్పత్రి స్థాపకుల్లో శుక్లా, దూబేలపై ఇప్పటికే గుజరాత్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌ యాక్ట్‌ ప్రకారం కేసులున్నాయని పోలీసులు తెలిపారు.

Updated Date - Nov 20 , 2024 | 04:45 AM