ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

IITs: తాండవిస్తున్న నిరుద్యోగం.. ఐఐటీల్లో చదివినా 38 శాతం మందికి దక్కని జాబ్స్

ABN, Publish Date - May 23 , 2024 | 09:13 PM

దేశంలో నిరుద్యోగం(Unemployement) ఏ స్థాయిలో ఉందో చెప్పే రిపోర్ట్ ఒకటి బయటకి వచ్చింది. ఇంజినీరింగ్ చదువులకు అత్యుత్తమ విద్యాసంస్థలుగా పేరుగాంచిన ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITs)లలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది.

ఢిల్లీ: దేశంలో నిరుద్యోగం(Unemployement) ఏ స్థాయిలో ఉందో చెప్పే రిపోర్ట్ ఒకటి బయటకి వచ్చింది. ఇంజినీరింగ్ చదువులకు అత్యుత్తమ విద్యాసంస్థలుగా పేరుగాంచిన ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IITs)లలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. ధీరజ్ సింగ్ అనే పూర్వ విద్యార్థి(ఐఐటీ కాన్పూర్) ఐఐటీల్లో నిరుద్యోగంపై గల గణాంకాలను సమాచార హక్కు చట్టం (RTI) కింద సేకరించాడు.

ఈ వివరాలను ధీరజ్ తన లింక్డ్‌ఇన్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. మొత్తంగా 23 ఐఐటీల్లో ప్లేస్‌మెంట్లు చాలా వరకు సంక్షోభంలో కూరుకుపోయాయి. ఈ ఏడాది మే నెల వరకు 23 ఐఐటీలలో 8 వేలకుపైగా విద్యార్థులకు ఉద్యోగాలు లభించలేదు. 2024లో ప్లేస్ మెంట్ల కోసం 21 వేల 500 మంది ఐఐటీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 13 వేల 410 మందికి ఉద్యోగాలు లభించాయి. మిగిలిన 38 శాతం (8 వేల 100) మంది నిరుద్యోగులుగానే మిగిలిపోయారు.


2022లో 3 వేల 4 వందల మంది ఐఐటీయన్లకు ఉద్యోగాలు లభించలేదు. కొత్తగా ఏర్పాటు చేసిన 14 ఐఐటీలలో క్యాంపస్ ప్లేస్ మెంట్ల కోసం రిజిస్టర్ చేసుకున్న 5 వేల 100 మంది విద్యార్థుల్లో 2 వేల 040 మందిని (40 శాతం) కంపెనీలు రిక్రూట్ చేసుకోలేదు.

అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఐఐటీలలో నిరుద్యోగుల సంఖ్య మరింత పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న 9 ఐఐటీలలో ఈ సమస్య ఎక్కువగా ఉంది.


పాత 9 ఐఐటీలలో కలిపి 16 వేల త400 మంది ప్లేస్ మెంట్ల కోసం ఈ ఏడాది దరఖాస్తు చేసుకోగా వారిలో ఇంకా 6 వేల మందికిపైగా ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఆరుగురు ఐఐటీ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు ధీరజ్ లింక్డిన్‌లో పోస్ట్ చేశాడు.

ADR Report: లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల్లో 121 మంది నిరక్షరాస్యులు.. ఏడీఆర్ రిపోర్ట్‌లో ఆసక్తికర విషయాలు

అత్యుత్తమ ఇంజినీరింగ్ కాలేజీల్లో చదివిన విద్యార్థులకు కూడా ఉద్యోగాలు లభించకపోవడం.. దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్య తీవ్రతను తెలియజేస్తోందని ఆయన పేర్కొన్నాడు.

For More National News and Telugu News..

Updated Date - May 23 , 2024 | 09:13 PM

Advertising
Advertising