ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jobs: సార్వత్రిక సమరం వేళ.. కొలువుల పండుగ.. 6,244 పోస్టుల భర్తీకి చర్యలు

ABN, Publish Date - Jan 31 , 2024 | 12:13 PM

మరో రెండు నెలల్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం నిరుద్యోగ ఓటర్లను ఆకర్షించేందుకు గ్రూపు-4 ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. మొత్తం 6,244 పోస్టులను భర్తీ చేయనుంది.

- జూన్‌ 9న గ్రూపు-4 రాత పరీక్ష

అడయార్‌(చెన్నై): మరో రెండు నెలల్లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం నిరుద్యోగ ఓటర్లను ఆకర్షించేందుకు గ్రూపు-4 ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. మొత్తం 6,244 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందుకోసం జూన్‌ 9న రాత పరీక్షను నిర్వహించనుంది. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరి తేదీని ఫిబ్రవరి 28గా నిర్ణయించింది. ఈ పోస్టులకు దాదాపు 20 లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తమిళనాడు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TNPSC) అంచనా వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లోని ఖాళీలతో పాటు కొత్త ఉద్యోగాలను టీఎన్‌పీఎస్సీ ఆధ్వర్యంలోనే భర్తీ చేస్తున్నారు.

భారీ సంఖ్యలో దరఖాస్తులు...

ఉద్యోగాలను గ్రూపు-1, 2, 3, 4 విభాగాలుగా విభజించారు. ఇందులో గ్రూపు-4 పోస్టులకు భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తుంటాయి. దీనికి కారణం... ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందు కనీస విద్యార్హత పదో తరగతి కావడమే. పైగా ఒకే ఒక రాతపరీక్ష, మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తుంటారు. గ్రూపు-4 కిందకు మొత్తం 11 రకాలైన ప్రభుత్వ ఉద్యోగ కేటగిరీలు వస్తాయి. 2020, 2021 సంవత్సరాల్లో కరోనా మహమ్మారి కారణంగా టీఎన్‌పీఎస్సీ ఆధ్వర్యంలో ఎలాంటి పరీక్షలు నిర్వహించలేదు. అయితే, 2022లో జూలై 24న 10,117 పోస్టుల భర్తీకి గ్రూపు-4 రాతపరీక్ష నిర్వహించి, గత యేడాది మార్చి 24న ఫలితాలను వెల్లడించారు. కానీ, అనివార్య కారణాలతో భర్తీ చేయలేదు. ఈ నేపథ్యంలో తాజాగా 6,244 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించి, జూన్‌ 9వ తేదీన ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పోస్టులకు జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 108 వీఏవో, టైపిస్ట్‌ 1705, షార్ట్‌హ్యాండ్‌ 448, ఫారెస్ట్‌ గార్డ్స్‌ 171, డ్రైవింగ్‌ లైసెన్స్‌తో కూడిన ఫారెస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు 192 ఇలా అనేక కేటగిరీల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు.

Updated Date - Jan 31 , 2024 | 12:13 PM

Advertising
Advertising