Kamal Haasan: నటుడు కమల్‌హాసన్ ఆసక్తికర కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే..
ABN, Publish Date - Jan 27 , 2024 | 01:35 PM
ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రజలు సమయం కేటాయించాలని మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమలహాసన్(Kamal Haasan) పిలుపునిచ్చారు.
- ఓటు వేసేందుకు సమయం కేటాయించండి
పెరంబూర్(చెన్నై): ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రజలు సమయం కేటాయించాలని మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమలహాసన్(Kamal Haasan) పిలుపునిచ్చారు. గతంలో పార్లమెంటు, శాసనసభ ఎన్నికల్లో 73 శాతం ఓట్లు నమోదయ్యాయన్నారు. రాబోయే ఎన్నికల్లో ఇది మరింత తగ్గే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారన్నారు. విద్య, వైద్య, ఉపాధి, అభివృద్ధి రంగాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందని, ఓటు ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుందని తెలిపారు. దేశ, రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా యంత్రంగా మారిన రోజువారీ జీవితంలో, ఎన్నికల్లో ఓటు వేసేందుకు ప్రజలు సమయం కేటాయించాలని కమల్ విజ్ఞప్తి చేశారు.
Updated Date - Jan 27 , 2024 | 01:35 PM