ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kangana Ranaut: పార్లమెంటులో కంగనా రనౌత్ తొలి స్పీచ్.. నెట్టింట వీడియో వైరల్!

ABN, Publish Date - Jul 25 , 2024 | 06:36 PM

మండీ నియోజకవర్గ ఎంపీ కంగనా రనౌత్ పార్లమెంటులో గురువారం తొలిసారిగా ప్రసంగించారు. తన నియోజకవర్గంలో, రాష్ట్రంలో అంతరించిపోతున్న కళారూపాలపై ఆవేదనా భరితప్రసంగం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమె నెట్టింట పంచుకున్నారు.

ఇంటర్నె్ట్ డెస్క్: సినీరంగం నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసిన కంగనా రనౌత్ (Kangana Ranaut) హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఘన విజయం సాధించారు. గురువారం తొలిసారిగా ఆమె తన రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై గళమెత్తారు. తన ప్రసంగం తాలూకు వీడియోను ఆమె స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

PM Modi: అమిత్ షాతో అజిత్ భేటీ.. కొద్ది గంటలకే.. బీజేపీలో కీలక పరిణామం

తొలిసారిగా పార్లమెంటులో ఎంపీగా ప్రసంగించిన ఆమె ముందుగా తనకీ అవకాశం ఇచ్చిన స్పీకర్‌కు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం, స్వరాష్ట్రానికి సంబంధించి అంతరించిపోతున్న కళలు, సంప్రదాయిక చేతివృత్తులపై ఆవేదనా పూరిత ప్రసంగం చేశారు. ‘‘మండీ నియోజకవర్గంలో వివిధ రకాల కళారూపాలు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో కథ్ కునీ అనే సంప్రదాయిక నిర్మాణ శైలి ఉంది. గొర్రె చర్మంతో జాకెట్స్, క్యాపులు, షాల్స్, దుస్తులతో పాటు వివిధ ఇతర రకాలు దుస్తులు తయారు చేస్తారు’’


‘‘వీటికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది కానీ ఈ వృత్తుల వారు క్రమంగా కనుమరుగవుతున్నారు. దీన్ని అడ్డుకునేందుకు ఏయే చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చించాలి. ఇక స్పిటీ, కిన్నౌర్, భార్మోర్‌ ప్రాంతాలకు చెందిన ఆదివాస సంప్రదాయిక సంగీతం కూడా తెరమరుగవుతోంది. దీన్ని కాపాడుకునేందుకు మనం ఏం చేస్తున్నాం’ అని ఆమె సభికులను ఉద్దేశించి ప్రశ్నించారు. ఈ వీడియోను నెట్టింట పంచుకున్న ఆమె.. తన నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలను పార్లమెంటుముందు ఉంచేందుకు తొలిసారిగా అవకాశం లభించిందని కామెంట్ చేశారు.

Kangana Ranaut: కంగనాకు హైకోర్టు నోటీసులు.. ఎందుకంటే

రాజకీయరంగంలో తొలి విజయం సాధించిన కంగనా అటు సినీరంగంలోనూ దర్శకురాలిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆమె దర్శకత్వంలో ఎమర్జె్న్సీ పేరుతో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, తదితర తారాగణంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. గతంలో ఈ సినిమా విడుదల పలుమార్లు వాయిదా పడ్డా తాజాగా కంగనా కీలక అప్‌డేట్ షేర్ చేశారు. సెప్టెంబర్ 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నారు.

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 25 , 2024 | 06:56 PM

Advertising
Advertising
<